బిజినెస్

45రోజులు.. 40లక్షల మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: ఆధునిక రవాణా వ్యవస్థ మెట్రోరైలు ఎపుడు అందుబాటులోకి వస్తుందా? అని ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన మహానగర వాసులు మెట్రోతో పెద్దగా ప్రయోజనం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. నవంబర్ 28న ప్రదాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభించిన మెట్రోరైలు ఆ మరుసటి రోజు 29 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చి నెలన్నర రోజులు పూర్తి చేసుకుంది. గడిచిన 45రోజుల్లో సుమారు 40లక్షల మంది ప్రయాణికులు మెట్రోరైలులో నాగోల్ నుంచి అమీర్‌పేట, అమీర్‌పేట నుంచి మియాపూర్ వరకు ప్రయాణించినట్లు అంచనాలున్నాయి. కానీ మెట్రోరైలు అందుబాటులోకి వచ్చిన మొదటి మూడు, నాలుగు రోజుల్లో ప్రతిరోజు లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా, వీరిలో జాయ్ రైడర్సే ఎక్కువ మంది ఉన్నారని చెప్పవచ్చు. కానీ కాలక్రమేనా ప్రజల్లో మెట్రోరైలు ప్రయాణం పట్ల ఆసక్తి తగ్గుతుందనే చెప్పవచ్చు. ఇందుకు కొద్దిరోజులుగా మెట్రోరైలులో ప్రతిరోజు కేవలం 30వేల నుంచి 40వేల మంది మాత్రమే ప్రయాణించటం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మెట్రోఛార్జీలు అత్యధికంగా ఉండటంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇందులో ప్రయాణించలేకపోతున్నారు.
అమీర్‌పేట నుంచి నాగోల్ ప్రయాణించేందుకు ఆర్టీసి బస్సులో గంట సమయం పడుతుండగా, మెట్రోరైలు కేవలం 40 నిమిషాల్లో ప్రయాణించే వెసులుబాటు ఉన్నా, కేవలం ఇరవై నిమిషాల సమయం కోసం రూ.20 ఆర్టీసి టికెట్‌కు బదులుగా మెట్రోకు రూ. 60 ఖర్చు చేయటం ఎందుకు? అని ప్రయాణికులు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన నాగోల్ నుంచి అమీర్‌పేట, అమీర్‌పేట నుంచి మియాపూర్ వరకు 30కిలోమీటర్ల మెట్రో కారిడార్‌లోని మెట్రో స్టేషన్లకు సమీపంలోని జనవాసాలకు కనెక్టివిటీ లేకపోవటం కూడా ఆదరణ తగ్గేందుకు మరో కారణమని చెప్పవచ్చు. దీనికి తోడు ఇంటి నుంచి సొంత వాహనంపై మెట్రో స్టేషన్‌కు వెళ్లినా, అక్కడ పార్కింగ్ సౌకర్యం లేకపోవటంతో సొంత వాహనాల్లోనే ప్రయాణించేందుకు జనం ఇష్టపడుతున్నారు. మరికొందరు ఆటోల్లో వచ్చి మెట్రోలో ప్రయాణించాలంటే ఛార్జీలు రెట్టింపు అవుతున్నందున మెట్రో ఎక్కేందుకు అనాసక్తి చూపుతున్నారు. పైగా మెట్రోరైలు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుందని భావించినా, ప్రస్తుతం ఆ ఎఫెక్టు కూడా కన్పించటం లేదు.
మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసి సేవలను అనుసంధానం చేస్తూ త్రీ ఇన్ వన్ పాస్ అందుబాటులోకి వచ్చి, మెట్రో ఛార్జీలు తగ్గి, స్టేషన్లలో సౌకర్యాలు పెరిగితే తప్పా, మెట్రోరైలు ప్రయాణానికి ఆదరణ పెరిగే అవకాశం లేదు. కానీ ప్రతిపాదిత మూడు కారిడార్లలో మెట్రోరైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరిగి రోడ్లపై ట్రాఫిక్ సమస్య తగ్గుతుందో? లేదో? వేచి చూడాలి!