బిజినెస్

విశాఖ ఏటీఎంలలో డబ్బుల్లేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 11: పండుగ దగ్గర పడుతోంది. ఖర్చు ఎంత ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే విశాఖ నగరంలో ఏటీఎంలలో నగదు నిల్వలు లేకుండా పోయాయి. గురువారం ఉదయం నుంచి నగరంలోని దాదాపు 80 నుంచి 85 శాతం ఏటీఎంలలో నగదు లేకపోవడం గమనార్హం. చాలా ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు తగిలించారు. మరికొన్నింటిని పాక్షికంగా మూసేశారు. మారుమూల సందుల్లో, ఎవ్వరూ పెద్దగా పట్టించుకోని ఏటీఎంల నుంచి అడపా దడపా డబ్బులు తీసుకోగలుగుతున్నారు. శనివారం నుంచి బ్యాంకులకు నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. రెండో శనివారం బ్యాంకు హాలిడే. ఆదివారం ఎలాగూ సెలవు. సోమవారం భోగి, మంగళవారం సంక్రాంతి కావడంతో నాలుగు రోజులు బ్యాంకులు తెరుచుకోవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఏటీఎంల వైపు పరుగులు తీశారు నో క్యాష్ బోర్డులు తగిలించడంతో, చెక్కు బుక్కులతో బ్యాంకులకు వెళ్లారు. పెద్ద పెద్ద మొత్తాలు ఇచ్చేందుకు బ్యాంకు యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. పెద్ద మొత్తం విత్‌డ్రా చేస్తామన్న విషయాన్ని ముందుగా తెలియచేయాలని సూచించారు. ఒక్కో ఖాతాదారునికి గరిష్ఠంగా 10 వేల రూపాయలు మాత్రమే చెల్లించారు. దీంతో బ్యాంకు ఖాతాదారులు అయోమయ పరిస్థితుల్లో పడ్డారు.

చిత్రం..విశాఖలో ఓ ఏటీఎం వద్ద క్యూ కట్టిన జనం