బిజినెస్

బాండ్లద్వారా రూ.20వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దీర్ఘకాలిక బాండ్ల ద్వారా రూ. 20వేల కోట్లు సేకరించడానికి కసరత్తు చేస్తోంది. ఎస్‌బీఐ అఫర్డబుల్ హౌసింగ్ కోసం ఈ నిధులను వినియోగిస్తుంది. ఎస్‌బీఐ ఇందుకోసం రూ. 5వేల కోట్లు సేకరించాలని గతంలో ప్రతిపాదించింది. దేశీయ, విదేశీ మార్కెట్లలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అఫర్డబుల్ హౌసింగ్ కోసం గతంలో ప్రతిపాదించిన రూ. 5వేల కోట్లకు బదులుగా రూ. 20వేల కోట్లు దీర్ఘకాలిక బాండ్లు జారీ చేయడం ద్వారా సేకరించేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీసీబీ) ముందు ప్రతిపాదిస్తామని ఎస్‌బీఐ స్టాక్ ఎక్స్చేంజీలకు సమర్పించిన ఒక పత్రంలో వెల్లడించింది. అయితే ఈ నిధులను రూపాయల్లో సేకరిస్తుందా? లేదా డాలర్లలో సేకరిస్తుందా? అనే విషయాన్ని ఎస్‌బీఐ స్పష్టం చేయలేదు. సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ నెల 17న సమావేశం కాబోతోందని ఎస్‌బీఐ పేర్కొంది.
విదేశాలలో విస్తరించడానికి అవసరమైన నిధుల కోసం రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో అమెరికన్ డాలర్లు లేదా ఇతర మారకం చేయగల కరెన్సీలో బాండ్లను జారీ చేయడం ద్వారా రెండు బిలియన్ డాలర్లు (రూ. 12,600 కోట్లు) సేకరించాలని నిర్ణయించినట్టు ఎస్‌బీఐ ఈ వారం మొదట్లో ప్రకటించింది. 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలలో పబ్లిక్ ఆఫర్, ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా ఈ నిధులను సేకరించనున్నట్టు తెలిపింది. బాసెల్-3 మూలధన నియమాలను పూర్తి చేయడానికి మసాలా బాండ్లు జారీ చేయడం సహా వివిధ మార్గాల ద్వారా రూ. 8వేల కోట్లు సేకరించడానికి బ్యాంకు బోర్డు గత నెలలో ఆమోదం తెలిపింది.