బిజినెస్

తొలిరోజే 20 ఫ్లాట్ల అమ్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో గల గుర్గావ్‌లో అత్యంత విలాసవంతమైన ఫ్లాట్లతో కూడిన బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నట్టు ప్రకటించిన 3ట్రంప్ టవర్స్2 బుకింగ్‌లను ప్రారంభించినట్టు ప్రకటించిన 24 గంటలలోనే 20 ఫ్లాట్లు రూ. 150 కోట్ల ధరకు అమ్ముడు పోయాయి. మొత్తం 250 అత్యంత విలాసవంతమైన ఫ్లాట్లను ఒక్కో ఫ్లాట్‌కు రూ. అయిదు కోట్ల నుంచి పది కోట్ల మధ్య ధరతో అమ్మనున్నట్టు ట్రంప్ టవర్స్ బుధవారం ప్రకటించింది. ట్రంప్ ఆర్గనైజేషన్ అనుమతితో ఈ ప్రాజెక్టును చేపట్టిన రెండు రియల్టీ సంస్థల్లో ఒకటయిన ఎం3ఎం ఇండియా గురువారం ఇక్కడ ఈ విషయం వెల్లడించింది. ఎం3ఎం సంస్థ భూమి వ్యయం కాకుండా, రూ. 1,200 కోట్ల అంచనా వ్యయంతో ట్రంప్ టవర్స్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టులోని మొత్తం 250 యూనిట్లను విక్రయించడం ద్వారా రూ. 2,500 కోట్లు ఆర్జించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ రియల్టీ బ్రాండ్ ట్రంప్ టవర్స్ రియల్ ఎస్టేట్ సంస్థలయిన ఎం3ఎం ఇండియా, ట్రిబెకా డెవలపర్స్ ద్వారా మొదటిసారి ఉత్తర భారతదేశంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. ఎం3ఎం ఇండియా రూ. 1,200 కోట్ల వ్యయంతో ట్రంప్ టవర్స్ ఢిల్లీ ఎన్‌సీఆర్‌ను నిర్మిస్తుండగా, ఈ ప్రాజెక్టులోని ఫ్లాట్లను విక్రయించే హక్కులను ట్రిబెకా డెవలపర్స్ తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడయిన ట్రంప్ జూనియర్ నేతృత్వంలోని 3ట్రంప్ ఆర్గనైజేషన్2 ఈ ప్రాజెక్టుకు 3ట్రంప్ బ్రాండ్2ను ఇచ్చింది. గుర్గావ్‌లోని ట్రంప్ టవర్స్‌లో అమ్మకాలు ప్రారంభించిన తొలి రోజే తాము రికార్డు స్థాయిలో రూ. 150 కోట్ల విలువయిన విక్రయాలు చేశామని ఎం3ఎం ఇండియా డైరెక్టర్ పంకజ్ బన్సల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.