బిజినెస్

సరికొత్త స్థాయిలకు సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 11: కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసిక ఆదాయాలపై మదుపరులలో ఆశావాద దృక్పథం నెలకొనడంతో గురువారం దేశీయ మార్కెట్లలో జోరుగా కొనుగోళ్లు సాగి కీలక సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిలకు చేరాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ), స్థిరాస్తి రంగాల షేర్ల పట్ల మదుపరులు ఆసక్తి కనబరిచారు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 70.42 పాయింట్లు పుంజుకొని 34,503.49 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 19 పాయింట్లు పెరిగి 10,651.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్లూచిప్ కంపెనీల ఆదాయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయన్న ఆశావాద దృక్పథంతో మదుపరులు ఉన్నారని స్టాక్ బ్రోకర్లు పేర్కొన్నారు. బీఎస్‌ఈలో గురువారం తొలుత మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. తరువాత కొనుగోళ్లు పుంజుకొని సెనె్సక్స్‌లో కదలిక మొదలయి, 34,558.88 పాయింట్లకు చేరుకుంది. తరువాత స్వల్పంగా తగ్గి క్రితం ముగింపుతో పోలిస్తే 70.42 పాయింట్ల (0.20 శాతం) లాభంతో 34,503.49 పాయింట్ల వద్ద ముగిసింది. జనవరి తొమ్మిదో తేదీ నాటి ముగింపు 34,443.19 పాయింట్ల గరిష్ఠ స్థాయిని గురువారం అధిగమించింది. 50 షేర్లతో కూడిన నిఫ్టీ ఉదయం లావాదేవీల్లో పరిమిత స్థాయిల మధ్య కదలాడి, తరువాత కొనుగోళ్లు ఊపందుకోవడంతో ఇంట్రా-డేలో ఆల్ టైమ్ హై 10,664.60 పాయింట్లను తాకింది. చివరలో కాస్త తగ్గి క్రితం ముగింపుతో పోలిస్తే 19 పాయింట్ల (0.18 శాతం) పెరుగుదలతో 10,651.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ సూచీ కూడా జనవరి తొమ్మిదో తేదీనాటి 10,637 పాయింట్ల ముగింపును అధిగమించింది. ఐటీ, రియల్టీ, స్మాల్‌క్యాప్ కంపెనీల షేర్లలో స్థిరమైన కొనుగోళ్ల కారణంగా దేశీయ మార్కెట్లలో నిలకడయిన సానుకూల ధోరణి నెలకొంది. అయితే బ్యాంకింగ్ షేర్లలో మాత్రం కొంత అనిశ్చిత పరిస్థితి నెలకొంది. మూడో త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల ఆదాయాల వృద్ధి ఆశాజనకంగా ఉంటుందనే అంచనాతో ఉన్న మదుపరులు ఎక్కువ ధరల వద్ద కూడా షేర్ల కొనుగోలుకు మొగ్గు చూపారు. అయితే, శుక్రవారం వెలువడనున్న వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం గణాంకాలు పెరుగుతాయనే అంచనా ఉంది. ఈ గణాంకాలు మదుపరులను అప్రమత్తంగా వ్యవహరించేట్లు ప్రభావితం చేయవచ్చు.
ఇదిలా ఉండగా, బుధవారం దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) నికరంగా రూ. 600.24 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 572.26 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. గురువారం సెనె్సక్స్ ప్యాక్‌లోని కంపెనీలలో ఇన్ఫోసిస్ 2.28 శాతం లాభపడింది. భారతి ఎయిర్‌టెల్ షేర్ విలువ 1.66 శాతం పెరిగింది. లాభపడిన ఇతర కంపెనీలలో కొటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, ఆసియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, ఎం అండ్ ఎం, యెస్ బ్యాంక్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అదాని పోర్ట్స్, ఐటీసీ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్‌జీసీ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 1.61 శాతం వరకు పెరిగింది. అయితే, ప్రైవేటు బ్యాంక్ ఇండస్‌ఇండ్ బ్యాంక్ 2017 డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో తన లాభాన్ని 24.72 శాతం పెంచుకొని, రూ. 936.25 కోట్లను ఆర్జించినప్పటికీ, ఆ కంపెనీ షేర్ విలువ అత్యధికంగా 2.08 శాతం తగ్గింది. నష్టపోయిన వాటిలో విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, టీసీఎస్, పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. రంగాల వారీ సూచీలలో బీఎస్‌ఈ రియల్టీ సూచీ రెండు శాతం పెరగగా, ఐటీ 0.89 శాతం, టెక్ 0.79 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.44 శాతం, ఆరోగ్య సంరక్షణ 0.27 శాతం, ఆటో 0.17 శాతం పుంజుకున్నాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, చమురు-సహజ వాయువు, క్యాపిటల్ గూడ్స్, వౌలిక సౌకర్యాలు, ప్రభుత్వ రంగ సంస్థల సూచీలు పడిపోయాయి. స్మాల్ క్యాప్ సూచీ 0.41 శాతం, మిడ్ క్యాప్ 0.27 శాతం పెరిగాయి.