బిజినెస్

900 ఆస్తులు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: బినామీ ఆస్తుల నిషేధం చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ఇంతవరకు 3,500కోట్ల విలువ చేసే 900 బినామీ ఆస్తులను జప్తు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. బినామీ ఆస్తుల నిషేధ చట్టం 2016 నవంబర్ ఒకటో తేదీనుండి అమల్లోకి రావటం తెలిసిందే. బినామీ నిషేధ చట్టం కింద జప్తు చేసిన ఆస్తుల్లో ప్లాట్లు, ఫ్లాట్లు, దుకాణాలు, వాహనాలు, బ్యాంకు డిపాజిట్లు, బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ వివరించింది. జప్తు చేసిన 3,500 కోట్ల విలువ చేసే ఆస్తుల్లో స్థిరాస్తుల విలువ 2,900కోట్ల రూపాయని ఆర్థిక శాఖ తెలిపింది. బినామీ ఆస్తులకు సంబంధించిన ఐదు కేసుల్లో మొత్తం 150కోట్ల విలువ చేసే బినామీ ఆస్తులను జప్తు చేశారు. ఈ జప్తులను అడ్జుకేటింగ్ అథారిటీ కూడా ధ్రువీకరించిందని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఒక కేసులో రియల్ ఎస్టేట్ సంస్థ 110కోట్ల రూపాయల విలువ చేసే భూమిని యాభై కోట్ల రూపాయలకు బినామీ పేర్లతో కొనుగోలు చేసిందని ఆర్థిక శాఖ తెలిపింది.
ఎలాంటి ఆస్తిపాస్తులు లేని వ్యక్తుల పేర ఈ భూమిని కొనుగోలు చేశారు. మరో కేసులో పెద్దనోట్ల రద్దు అనంతరం ఇద్దరు పన్ను చెల్లంపుదారులు తమ వద్ద ఉద్యోగం చేసేవారి ఖాతాల్లో వివిధ బ్యాంకుల నుండి డబ్బు డిపాజిట్ చేసినట్లు తమ దృష్టికి వచ్చింది, మొదట ఉద్యోగుల ఖాతాల్లో జమచేసిన డబ్బును ఆ తరువాత తమ ఖాతాల్లోకి మార్చుకున్నారు, వీరిలా 39కోట్ల రూపాయలను మార్చుకున్నట్లు దృష్టికి రాగానే వారి బ్యాంకు ఖాతాలను జప్తు చేసినట్లు ఆర్థిక శాఖ వివరించింది. పలు ఇతర కేసుల్లో నగదు జప్తు అయిందనీ, ఈ నగదు తమది కాదంటే తమది కాదని పట్టుబడినవారు, వారు పేరు చెప్పినవారు కూడా నిరాకరించటంతో ఈ డబ్బంతా ప్రస్తుతం ప్రభుత్వ ఖాతాల్లోకి వెళ్లిందని ఆర్థిక శాఖ తెలిపింది. బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద జప్తు చేసిన ఆస్తులు కలిగి ఉన్నవారికి ఏడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు జప్పు చేసిన ఆస్తికి సంబంధించి 25శాతం విలువను జరిమానాగా విధించటం జరిగిందని ఆర్థిక శాఖ వెల్లడించింది. బినామీ ఆస్తుల గురించి దర్యాప్తు చేసి జప్తు చేయటం వంటి కార్యక్రమాలు నిర్వసించేందుకు ఆదాయం పన్ను శాఖ పరిధిలో 24 ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయని ఆర్థిక శాఖ తెలిపింది.