బిజినెస్

మార్కెట్‌లోకి ఉద్గార రహిత పెయింట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: భారత దేశ పెయింట్స్ మార్కెట్ పరిమాణం 2019-20 నాటికి రూ.70,875 కోట్లకు చేరుకుంటుంద ని, ఈ డిమాండ్‌ను దృష్టిలోపెట్టుకుని స్పెయిన్‌కు చెందిన గ్రాఫెన్‌స్టోన్‌తో కలిసి వివోసి ఉద్గార రహిత పెయింట్స్‌ను ఆవిష్కరించినట్లు కామధేను సంస్థ పేర్కొంది. ఈ సంస్థ డైరెక్టర్ సౌరభ్ అగర్వాల్ ఇక్కడ మాట్లడుతూ కాలుష్య రహిత పర్యావరణ స్నేహపూర్వక పెయింట్ కంపెనీగా ఉండేందుకు కామధేను సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ గియన్‌కార్లో మాట్లాడుతూ సంప్రదాయేతర పెయింట్స్‌లో హానికారక రసాయనాలు, ఫార్మల్ డిహైడ్, బెం జిన్ లాంటి పదార్ధాలు ఉండవన్నారు. ఈ పెయింట్స్ కళ్లు, ముక్కు,గొంతు, చర్మం వంటి వాటిని చికాకు కల్పించవన్నాలరు. మగత, సమస్యలు తలెత్తవన్నారు. 250 కంటే తక్కువ రసాయనాలు ఉత్పత్తులను తమ సంస్థ తయారు చేస్తున్నట్లు చెప్పారు. రసాయనాల్లో 98 శాతం మొక్కలు, ఖనిజాల నుంచి సేకరించేవి ఉన్నాయన్నారు.