బిజినెస్

టైర్ వన్ సంస్థల్లో.. 75 శాతం ప్లేస్‌మెంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: మేనేజిమెంట్, ఇంజనీరింగ్ కాలేజీల్లో టైర్ ఒన్ సంస్థల్లో ప్లేస్‌మెంట్లకు ఢోకాలేదు. అదే టైర్-2 కాలేజీల్లో మాత్రం ప్లేస్‌మెంట్లు గణనీయంగా పడిపోయినట్లు విజ్‌డమ్‌జాబ్స్.కామ్ అనే సంస్థ ‘క్యాంపస్ హైరింగ్ ఇన్ ఇండియా’ అనే శీర్షికతో రూపొందించిన నివేదికలో పేర్కొంది. హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కొత్తా, పూణే నగరాల్లో విద్యా సంస్థల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఐటి, ఇ-కామ్, రిటైల్, ఎఫ్‌ఎంసిజి సంస్థలు, మేనేజిమెంట్, ఇంజనీరింగ్ విద్య సంస్థల్లో సర్వేను నిర్వహించినట్లు ఆ సంస్థ పేర్కొంది. టైర్ -1 విద్యా సంస్థల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్లు 75 శాతం ఉంటే, అదే టైర్-2, టైర్-3 సంస్థల్లో 38 శాతం మాత్రమే ఉన్నాయి. క్యాంపస్‌లలో టైర్-2, టైర్-2 సంస్థల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో 21 శాతం క్షీణదల కనపడింది. అలాగే ఈ సంస్థలను సందర్శిస్తున్న సంస్థల సంఖ్య కూడా 30 శాతానికి పడిపోయింది. ప్రీమి యం సంస్థలతో పోల్చితే, నాన్ ప్రీమియం సంస్థల్లో ప్లేస్‌మెంట్లు ఆశాజనకంగా లేవు. సైన్స్, టెక్నాలజీలో అప్‌డేట్స్ లేకపోవడం, అధ్యాపకులు, టీచర్ల మధ్య అగాధం ఉండడం కూడా కారణం. టైర్-2, టైర్-3 సంస్థల్లో ప్రాక్టికల్స్ తక్కువ. థియరీకే కాలేజీలు పరిమితమవుతున్నాయి. వౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. తాజా టెక్నాలజీతో విద్యార్థులకు అనుసంధానం లేదు. చాలా మటుటు ప్రీమియం కాని కాలేజీల్లో అధ్యాపకుల్లో నైపుణ్యం లేదు. 60 శాతం విద్యా సంస్థల్లో అర్హత ఉన్న ఫ్యాకల్టీ లేదు. అధ్యాపకుల్లో నైపుణ్యత లోపించింది. ఆటోమేషన్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై ఫోకస్ తగ్గింది. వీటిల్లో శిక్షణ ఉంటే ఉద్యోగావకాశాలు ఎక్కువ. నైపుణ్యం ఎక్కువ ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కంపెనీలు పోటీ పడుతుంటాయి. ఐటి సేవల్లో 23 శాతం ప్లేస్‌మెంట్లు తగ్గించేశాయి.