బిజినెస్

భవిష్యత్తు రోడ్‌మ్యాప్ ఏప్రిల్‌లో విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 12: ఇన్ఫోసిస్ కంపెనీ వ్యూహాత్మక ప్రాధాన్యతలను తాను ఏప్రిల్ నాటికి రూపొందిస్తానని కంపెనీ కొత్త కార్యనిర్వహణాధికారి (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) సలీల్ పరేఖ్ తెలిపారు. వ్యూహాత్మక ప్రాధాన్యతలను రూపొందించడానికి ప్రస్తుతం సమీక్ష కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఈ నెల 2న ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీగా బాధ్యతలు స్వీకరించిన పరేఖ్ తొలిసారి శుక్రవారం మీడియాతో భేటీ అయ్యారు. కంపెనీ భవిష్యత్తు రోడ్‌మ్యాప్‌ను ఏప్రిల్‌లో ప్రకటిస్తామని, ఆ రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి ఉద్యోగులను, క్లయింట్లను అనుసంధానం చేయటం వంటివి తన తక్షణ ప్రాధాన్యతల్లో ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తమ క్లయింట్లలో ప్రతి ఒక్కరు డిజిటల్ డిస్రప్షన్2ను ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, ఇది తమ కంపెనీకి ఒక అవకాశాన్ని సృష్టిస్తోందని అన్నారు. ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని ప్రారంభించిన వ్యూహం నిర్మాణం గురించి మాట్లాడుతూ, కంపెనీ నాలుగు అంశాలు- కొత్త మార్కెట్ అవకాశాలు, క్లయింట్ రిలేషన్‌షిప్స్, ప్రజలు, సర్వీస్ ఆఫరింగ్ పోర్ట్ఫోలియోలను సమీక్షిస్తోందని వెల్లడించారు. కంపెనీ అంచనాలు, దృక్పథాన్ని పరీక్షించి, ఈ నాలుగు కీలక అంశాలతో కూడిన సమగ్రమైన దృక్పథాన్ని రూపొందించడానికి రానున్న మూడు నెలల కాలంలో తాను తమ అనేక మంది క్లయిం ట్లు, ఉద్యోగులు, భాగస్వాములతో సమావేశం కాబోతున్నానని, తమ కంపెనీ నాయకత్వ బృందం, బోర్డుతో కలిసి పనిచేయనున్నానని పరేఖ్ తెలిపారు. ఈ కసరత్తు ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని, అప్పుడు తాను కంపెనీని ముందుకు తీసికెళ్లడానికి వ్యూహాత్మక ప్రాధాన్యతలను రూపొందిస్తానని చెప్పారు.