బిజినెస్

ఆరో వారమూ లాభాల్లో మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 13: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో వారం లాభాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఈ వారంలో 438.54 పాయింట్లు పుంజుకొని సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 34,592.39 పాయింట్ల వద్ద ముగియగా, 50 షేర్లతో కూడిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కొత్త మైలురాయి 10,600 పాయింట్లను అధిగమించింది. ఈ వారంలోని ఎక్కువ ట్రేడింగ్ సెషన్లలో కీలక సూచీలు రికార్డుల పరుగులు తీయడంతో స్టాక్ మార్కెట్లలో షేర్ల ధరలు పటిష్ఠంగా ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న తరుణంలో కొద్దిసార్లు మాత్రం మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించి లాభాల స్వీకరణకు పూనుకున్నారు. అలాగే నలుగురు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి, ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తున్న తీరుపై బహిరంగంగా విమర్శలు గుప్పించడంతో అత్యున్నత న్యాయస్థానం నిర్వహణపై ఆందోళన చెందిన మదుపరులు కొద్ది సేపు అమ్మకాలకు పూనుకున్నారు.
దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాను గత వారం సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్‌ఓ) తగ్గించినప్పటికీ, ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మూడో త్రైమాసికంలో నికర లాభం వృద్ధి రేటు పడిపోయినప్పటికీ, ఇతర కార్పొరేట్ కంపెనీల లాభాలు బాగుంటాయనే ఆశాజనక దృక్పథం మదుపరులలో నెలకొనడంతో పాటు స్టాక్ మార్కెట్లలోకి దేశీయ నిధులు తరలిరావడం వల్ల మార్కెట్లలో కొనుగోళ్లు పుంజుకొని కీలక సూచీలు ఈ వారంలో సరికొత్త రికార్డు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లలోని సానుకూల ధోరణులు కూడా ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతంగా నిలిచాయి.
అమెరికా హెచ్1బీ వీసా నియమాలు ఎట్టకేలకు భారతీయులకు అనుకూలంగానే మిగిలిపోవడంతో ఐటీ సూచీ పుంజుకుంది. రిలయన్స్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, ఐటీసీ వంటి ఇండెక్స్‌లోని దిగ్గజ కంపెనీల షేర్లకు మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో కీలక సూచీలు పైకి ఎగబాకాయి. ఈ వారంలో సెనె్సక్స్ అధిక స్థాయిల వద్ద ప్రారంభమయి, ఆల్‌టైమ్ హై 34,638.42, కనిష్ట స్థాయి 34,216.33 పాయింట్ల మధ్య కదలాడింది.
చివరకు ఈ వారంలో క్రితం వారం ముగింపుతో పోలిస్తే 438.54 పాయింట్ల (1.28 శాతం) లాభంతో సరికొత్త గరిష్ఠ స్థాయి 34,592.39 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్ క్రితం అయిదు వారాలలో కలిపి 1,681.71 పాయింట్లు (5.12 శాతం) పుంజుకుంది.
నిఫ్టీ కూడా ఈ వారం 10,591.70 పాయింట్ల అధిక స్థాయిల వద్ద ప్రారంభమయి, పైకి ఎగబాకుతూ 10,600 స్థాయిని అధిగమించి, గరిష్ఠంగా 10,690.40 పాయింట్ల, కనిష్టంగా 10,588.55 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 122.40 పాయింట్ల (1.16 శాతం) లాభంతో 10,681.25 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ వారంలో రియల్టీ రంగం అత్యధికంగా లాభపడింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ), టెక్, ఐపీఓ, చమురు- సహజ వాయువు, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకులు, హెల్త్‌కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ తరువాత స్థానాల్లో నిలిచాయి. అయితే, పవర్, ఆటో రంగాలు లాభాల స్వీకరణకు గురయ్యాయి. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) ఈ వారంలో నికరంగా రూ. 496.47 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ మిడ్-క్యాప్ సూచీ ఈ వారంలో ముందుకు సాగి 67 పాయింట్లు (0.37 శాతం) పెరిగి 18,137.03 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ స్మాల్-క్యాప్ సూచీ 288.27 పాయింట్లు (1.46 శాతం) పుంజుకొని 19,993.19 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ రెండు సూచీలు పుంజుకోవడం ద్వారా సెనె్సక్స్ పైకి ఎగబాకింది.