బిజినెస్

హైదరాబాద్ మార్కెట్లోకి ఆడి క్యు5 కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: హైదరాబాద్ మార్కెట్లోకి శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రెండవ జనరేషన్ ఆడి క్యు 5 కారును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆడి హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వీమాట్లాడుతూ 2009 నుంచి తమ సంస్ధ కార్లు మార్కెట్లో ఉనద్నాయని, భారతీయుల హృదయాలను గెలుచుకున్నామన్నారు. కొత్త ఆడి క్యు కారు విలువ రూ..53.25 లక్షలని చెప్పారు. ఈ కారులో ఉన్నత సామర్ధ్యం ఉన్న 2.0 టిడిఐ ఇంజన్ ఉందని, 2188 కి.మీ వేగంతో పోయే సామర్ధ్యం కలిగి ఉందన్నారు. ఐదు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయన్నారు. టెక్నాలజీతో అన్ని హంగులు, ఫీచర్లు ఆడి క్యు 5 కారులో ఉన్నాయన్నారు. ఇంధన సామర్ధ్యం 20 శాతం ఎక్కువన్నారు. ఉన్నత శ్రేణి సామర్ధ్యంతో 8 ఎయిర్ బ్యాగులు అమర్చామన్నారు.
మాదాపూర్‌లో హెడ్‌డిఎఫ్‌సి
లిమిటెడ్ ప్రారంభం
తెలంగాణలో హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ 15వ బ్రాంచిని శుక్రవారం ఇక్కడ హైటెక్ సిటీలో మాదాపూర్‌లో ప్రారంభించినట్లు ఆ సంస్ధ ఎగ్జిక్యూటివ్ మాథ్యూ జోసెఫ్ తెలిపారు.హైటెక్ సిటీ ప్రాంతంలో ప్రజలకు ఆర్‌బిఐ ఆదేశాల మేరకు తక్కువవడ్డీకే గృహరుణాలను అందిస్తామన్నారు. వినియోగదారులకునాణ్యమైన సేవలను అందిస్తామన్నారు. హైటెక్ సిటీ ప్రపంచంలో గుర్తింపు పొందిన ప్రాంతమని, ఇక్కడ తమ సేవలను పటిష్టంగా అందిస్తామన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు ఆఫర్ చేస్తున్న వివిధ స్కీంలను వివరించారు.
కంపెనీ సెక్రటరీ ఇనిస్టిట్యూట్
కొత్త అధ్యక్షుడుగా మకరంద్ లీలే
ప్రతిష్టాకరమైన ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ కొత్త అధ్యక్షుడిగా సిఎస్ మకరంద్ లీలె, ఉపాధ్యక్షుడిగా ఆహ్లాదరావు వి ఎన్నికయ్యారు. తాము కంపెనీ సెక్రటరీ సంస్ధ లక్ష్యాల సాధనకు అంకితభావంతో పని చేస్తామని, భారతదేశంలో కార్పోరేట్ రంగం విస్తరించడంతో కంపెనీ సెక్రకటరీలకు ఉద్యోగావకాశాలు పెరిగాయన్నారు.