బిజినెస్

వైద్య పరికరాలు తయారు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: గ్లోబల్ ఫార్మా కంపెనీ రోషే ప్రతినిధి క్రిస్టోఫె ఫ్రాంజ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్‌లో దీర్ఘకాలంగా తమ కార్యకలాపాలు సాగిస్తోందని అయితే తమ కార్యకలాపాలను మరింత విస్తరించదల్చామని రోషే ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం తాము అత్యున్నత ఎలక్ట్రానిక్ మెడికల్ హెల్త్ రికార్డుల తయారీపై అధ్యయనం చేస్తున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. దానికి స్పందించిన సీఎం కేంద్ర ప్రభుత్వ సహకారంతో 4నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఉత్తమ ప్రయత్నం మొదలుపెట్టామని, మీరు కూడా కలిసి వస్తే సంయుక్తంగా చేపడదామని ఆహ్వానించారు. రోషే సంస్థ తమ వైద్య పరికరాల తయారీ కేంద్రంగా ఏపీని ఎంచుకుంటే బావుంటుందని సూచించారు. ప్రస్తుతం భారత, ఆంధ్రప్రదేశ్ పాలసీల వల్ల తక్కువ సుంకాలు ఉన్నాయి. దాంతో పాటు ప్రభుత్వం తరపున వైద్య పరికరాల కొనుగోలుకు తయారీ సంస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.