బిజినెస్

రోటావాక్ టీకాకు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: అతిసార వ్యాధిని అరికట్టేందుకు భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన ‘రోటావాక్’ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి ఫ్రి క్వాలిఫికేషన్ గుర్తింపు లభించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ ప్రతినిధులు బుధవారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడారు. సంస్థ సీఎండీ కృష్ణా ఎల్లా మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అర్హత పొందిన భారత కంపెనీ తమదేనని వెల్లడించారు. డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు లభించడంతో భారత్ నుంచి ఇతర దేశాలకు ఈ వ్యాక్సిన్ ఎగుమతి చేసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా 20 కోట్ల టీకాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం తమ సంస్థ కలిగివుందని పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ రూపొందించేందుకు పరిశోధన, అభివృద్ధికి రూ.1600 కోట్లు వ్యయం చేసినట్టు ఆయన తెలిపారు. బిల్-మిలిందా గేట్స్ ఫౌండేషన్ రూ.450 కోట్ల గ్రాంటుగా అందించిందని ఎల్లా చెప్పారు. దాదాపుగా 16 సంవత్సరాలు కృషి చేసిన అనంతరం ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంత చిన్నారులకు ఈ టీకా ఒక వరంగా ఆయన అభివర్ణించారు. 2015లో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా విడుదలైన ఈ ఔషధం ఇప్పటికే దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో అందుబాటులో ఉందన్నారు. త్వరలో ఇతర రాష్ట్రాలో కూడా అందుబాటులోకి రానుందని కృష్ణ ఎల్లా ప్రకటించారు. ఇంకా సంస్థ ప్రతినిధులు సుచిత్ర ఎల్లా, భారతీయ శిశువైద్య నిపుణుడు, క్లినికల్ శాస్తవ్రేత్త డా ఎంకే బాన్ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు.