బిజినెస్

వ్యాపారులకు జీఎస్‌టీ సేవలందించేందుకు మాస్టర్స్ ఇండియా సువిధ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 24: రాష్ట్రంలో వ్యాపారులకు జీఎస్‌టీ సంబంధిత సేవలు అందించేందుకు సువిధ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు మాస్టర్స్ ఇండియా సీఈఓ నిశాంక్ గోయల్ తెలిపారు. బుధవారం విజయవాడలోని ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా సువిధ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన 34 సంస్థల్లో తమది ఒకటి అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఆతిథ్యం, ఆరోగ్య రంగాలతోపాటు సమాచార సాంకేతిక రంగాల్లో అందిస్తున్న సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ రంగంలో కూడా సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ రంగంలో కూడా సేవలు అందించేందుకు అవకాశం కల్పించిందని తెలిపారు. తమ సంస్థ ద్వారా వ్యాపారులకు జీఎస్‌టీ అమలులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చార్టెడ్ ఎక్కౌంట్ (సీఏ)ల బృందం నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని తెలిపారు. వ్యాపారులు సువిధ కేంద్రాల ద్వారా అన్ని వ్యాపార లావాదేవీలు సులువుగా నిర్వహించుకోవచ్చని చెప్పారు. ముఖ్యంగా జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ రిటర్ను దాఖలు, చెల్లింపు, ఆన్‌లైన్ మార్పిడులు, బ్యాంకింగ్ ఫైనాన్స్ వంటి ఎన్నో సేవలు పొందవచ్చని తెలిపారు. తొలి విడతగా 15 కేంద్రాలను ప్రారంభిస్తున్నామని, రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన ప్రాంతాల్లో సువిధ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జీఎస్‌టీ అమలులో ఎటువంటి సమస్యలున్నా తమ కేంద్రాల్లో సంప్రదించి ప్రశాంత వాతావరణంలో వ్యాపారాభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ ఇండియా మాస్టర్ కో ఆర్డినేటర్ ఎం సత్యనారాయణ, ఆంధ్రా కోఆర్డినేటర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇతర జీఎస్‌టీపై వివరాల కోసం తెలుగు వారి కోసం ఏర్పాటు చేసిన 18004196961 టోల్‌ఫ్రీ నెంబర్ నందు పొందవచ్చని తెలిపారు.