బిజినెస్

మరో ఐదు పోస్ట్ఫాసుల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పరిశీలనలో ప్రతిపాదన * ఆర్పీవో శ్రీనివాసరావు వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 24: పాస్‌పోర్టు సేవలను ప్రజలకు మరింతగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా మరో ఐదు పోస్ట్ఫాసుల్లో సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు విజయవాడలోని రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ డీఎస్‌ఎస్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నాటికి వీటిని అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో ఆయన బుధవారం ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ గుంటూరు, ఒంగోలు, అనంతపురం సహా చిత్తూరు, కర్నూలు జిల్లాలో ఒక్కోచోట ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందన్నారు. కార్యాలయం ఏర్పాటుకు అనువైన భవనం లభించగానే పీవోపీఎస్‌కేలు పనిచేయడం ప్రారంభిస్తాయన్నారు. విజయవాడలో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని గత ఏడాది ఏప్రిల్ ప్రారంభించారని, ఇప్పటివరకూ 1.79 లక్షల పాస్‌పోర్టు దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో 1.49 లక్షల పాస్‌పోర్టులు ముద్రించామని, 1.47 లక్షల పాస్‌పోర్టులు జారీ చేశామన్నారు. దరఖాస్తుదారులు తమ చిరునామా తప్పుగా ఇవ్వడం వల్ల పోలీసుల పరిశీలనలో యాడ్వర్సు రిపోర్టు వస్తోందన్నారు. దీనివల్ల పాస్‌పోర్టు జారీలో జాప్యం జరుగుతోందన్నారు. తాము ఎక్కడ నివాసం ఉంటున్నారో ఆ పరిధిలోని పాస్‌పోర్టు కార్యాలయంలో దరఖాస్తు చేయాలని, కచ్చితమైన సమాచారం ఇవ్వడం ద్వారా త్వరగా పాస్‌పోర్టు పొందే వీలుంటుందని సూచించారు. ఒకచోట ఉంటూ మరోచోట ఉంటున్నట్లుగా సమాచారం ఇవ్వడం వల్ల పోలీస్ తనిఖీలో గుర్తిస్తారని, దీంతో పాస్‌పోర్టు జారీ కావడం ఆలస్యమవుతుందన్నారు.