బిజినెస్

ఉద్యోగాలిచ్చేలా ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 25: యువత ఉపాధి అవకాశాల కోసం కాకుండా ఉద్యోగాలిచ్చే పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు విస్తృత కార్యక్రమాలు అమలు చేస్తోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి వై. సుజనా చౌదరి అన్నారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థి పారిశ్రామికవేత్తగా ఎదిగేలా యూనివర్శిటీలు ప్రత్యేక సాంకేతిక కోర్సులు అందించాలన్నారు. దీనికోసం నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఎన్‌ఆర్‌డీసీ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తం గా 3000 సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ విద్యనభ్యసించే విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని యువత పరిశ్రమల స్థాపనకు ముం దుకు రావాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు కేంద్ర ప్రభుత్వం ముద్ర రుణాలు అందజేస్తుందన్నారు. విశాఖలో ల్యాబ్స్‌ఫార్మాస్యూటికల్ ఎనలైటికల్ రీసెర్చ్ ల్యాబ్‌ను కేంద్రం మంజూరు చేసిందని, ఈ ప్రాజెక్టును విశాఖలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు 10వేల చదరపు గజాల స్థలం అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం స్థలం మంజూరు చేస్తే ల్యాబ్ ఏర్పాటు పనులు ప్రారంభమవుతాయన్నారు.
అంతకు ముందు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్‌ఐఆర్) ఆధ్వర్యంలో జరిగిన బీ ఏన్ ఎంటర్‌ప్రన్యూర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (బెస్ట్) కార్యక్రమంలో భాగంగా యుఎస్‌కు చెందిన యంగ్స్‌టౌన్ స్టేట్ యూనివర్శిటీలో సాంకేతిక విద్యనభ్యసించే విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించే ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యంగ్స్‌టౌన్ స్టేట్ యూనివర్శిటీ అధికారులు, విద్యాశాఖ అధికారులు పరస్పరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందం మేరకు యుఎస్ యూనివర్శిటీల్లో విద్యనభ్యసించే రాష్ట్ర విద్యార్థులకు ఫీజు రాయితీ లభించనుంది. సమావేశంలో రాష్ట్ర మానవ వనరులు శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..యంగ్స్‌టౌన్ స్టేట్ యూనివర్శిటీ ప్రతినిధులతో ఎంఓయూ పత్రాలు
మార్చుకుంటున్న ఉన్నత విద్యాశాఖ అధికారులు