బిజినెస్

పారిశ్రామిక నగర నిర్మాణానికి మహీంద్ర ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 25: ఆంధ్రప్రదేశ్‌లో మహీంద్ర గ్రూప్ మరింత శక్తిమంతంగా తన ఉనికిని చాటాలని వ్యాపార, సేవా కార్యక్రమాలను విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. దావోస్‌లో మహీం ద్ర సంస్థ గ్రూప్ అధిపతి ఆనంద్ మహీంద్ర ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సెజ్ తరహాలో ప్రపంచ శ్రేణి పారిశ్రామిక నగరం నిర్మించాలని ప్రణాళికను రూపొందిస్తున్న మహీంద్ర గ్రూపు ప్రతిపాదనను సీఎం ముం దుంచినపుడు ఆయన స్పందిస్తూ ఆ ఇండస్ట్రియల్ సిటీ సెజ్‌ను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. తాము అన్నివిధాలా సహకరిస్తామన్నారు. సెజ్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకోడానికి తమ రాష్ట్రానికి రావాలని ముఖ్యమంత్రి ఆనంద్ మహీంద్రను కోరారు. రాజధాని అమరావతి నిర్మాణం, ప్రణాళికలో భాగస్వామి కావాలని ఆహ్వానించారు. అమరావతిలో పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో సహకరించాలని కోరారు. రాష్ట్రం లో నైపుణ్య శిక్షణాభివృద్ధిలో భాగస్వామి కావాలని సూచించారు. ఇదిలావుంటే ప్యానల్ చర్చలో ‘మీ విజన్ ఏమిటి?’ అని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆనంద్ మహీంద్ర ప్రశ్నించగా.. ‘ఏపీని ప్రపంచానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది నా విజన్’ అని సమాధానమిచ్చారు. ‘్భరత్‌కు ఆదర్శంగా కాదా?’ అని ప్రశ్నించగా, మూడు నాలుగేళ్లలోనే భారత్‌కు ఆదర్శంగా రూపొందిస్తామని చెప్పారు. ‘మా రాష్ట్రాన్ని ప్రపంచానికే ఒక ఆదర్శ నమూనాగా తీర్చిదిద్దడం నా స్వప్నం’ అని చంద్రబాబు వివరించారు. కాగా మహీంద్ర కంపెనీ ఫ్రాన్స్ దేశానికి అరకు కాఫీని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కాఫీని ప్యారిస్‌లో మార్కెటింగ్ చేస్తోంది. తాను నాందీ ఫౌండేషన్ అధిపతిగా ఉంటూ ఏపీలో ఫౌండేషన్‌ను ముఖ్యమంత్రి సంతృప్తికి అనుగుణంగా నడుపుతున్నానని ఆనంద్ మహీంద్ర చెప్పారు.
యుల్లి జాన్సన్ భేటీ
తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో జాన్సన్ ఇనె్వస్ట్‌మెంట్స్ అధిపతి యుల్లి జాన్సన్ సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించగా, జాన్సన్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తెచ్చేందుకు తాము చొరవ తీసుకుంటామని, అన్ని అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు.