బిజినెస్

‘ఆక్వా’ ఎగుమతుల్లో ప్రథమ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 27: విదేశాలకు రొయ్యల ఉత్పత్తిలోను, అన్ని రకాల ఆక్వా ఉత్పత్తుల టర్నోవర్‌లోను తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన దేవీ ఫిషరీస్ సంస్థ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. మత్స్య సంపద ఎగుమతుల రంగంలో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకు దేవీ ఫిషరీస్‌కు 2016-17 సంవత్సరానికి గాను మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్మెంట్ అధారిటీ (ఎంపెడా) రెండు జాతీయ అవార్డులను ప్రదానం చేసింది. శనివారం ఎంపెడా ఆధ్వర్యంలో గోవాలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ సీఫుడ్స్ ఫెయిర్‌లో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి సురేష్‌ప్రభు, గోవా ముఖ్యమంత్రి పారేకర్ తదితరులు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యార్లగడ్డ సూర్యారావుకు ఈ అవార్డులు అందజేశారు. ఈ మేరకు కాకినాడలో శనివారం సంస్థ ప్రతినిధులు విడుదల చేసిన ప్రకటనలో జాతీయ స్థాయిలో సంస్థ సాధించిన అవార్డుల వివరాలను తెలియజేశారు. అన్ని రకాల ఆక్వా ఉత్పత్తుల టర్నోవర్‌లోను, విదేశాలకు రొయ్యల ఎగుమతిలోను దేవీ ఫిషరీస్ జాతీయ స్థాయిలో రెండు ప్రథమ స్థానాలను సాధించిందని చెప్పారు. గడచిన ఏడాది కాలంలో సంస్థ 1100 కోట్ల టర్నోవర్ సాధించిందన్నారు. కాకినాడలో రెండు ఆక్వా పరిశ్రమలు, విశాఖ నగరంలో ఒక పరిశ్రమ ఉందని తెలిపారు. ఈ పరిశ్రమల్లో ప్రత్యక్షంగా 7వేల మందికి, పరోక్షంగా మూడు వేల మందికి ఉపాధి లభించిందన్నారు. కొత్తగా తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో ఓ పరిశ్రమ నెలకొల్పామని, సీడ్, ఫీడ్ విభాగాల్లో కూడా తమ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించిందని పేర్కొన్నారు. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులను అందించడం వలన గతంలోనూ అనేక అవార్డులు లభించినట్టు చెప్పారు.

చిత్రం..కేంద్ర మంత్రి సురేష్‌ప్రభు, గోవా సీఎం పారేకర్‌ల నుండి
అవార్డులు అందుకుంటున్న యార్లగడ్డ సూర్యారావు