బిజినెస్

పరిశోధనలతో మరింత ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: పరిశోధనలతో మరింత ప్రగతి సాధ్యం అవుతుందని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన శనివారం ‘డెవలపింగ్ ఆర్ అండ్ డి ఇన్ ఇండియా’ అనే అంశంపై జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ, పరిశోధనా రంగానికి ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం పరిశోధనా సంస్థలు, ఉన్నత విద్యా సంస్థలు మరింత చొరవ తీసుకోవాలని అన్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ రంగంలో ఆసక్తి ఉన్న కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి రావాలని ఆయన ఆహ్వానించారు. ప్రైవేటు రంగంలో పెద్ద సంస్థలు చేస్తున్న పరిశోధనలతో దేశంలోనే అకడమిక్ రీసెర్చ్‌ని సమ్మిళితం చేసినప్పుడు మెరుగైన పలితాలు వస్తాయని అన్నారు. పరిశోధన కార్యక్రమాలతో పాటు పరిశోధనాంతర ఫలితాల ఆధారంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉండేలా చూడాలని ఆయన కేంద్రాన్ని కోరారు. సిలికాన్ వ్యాలీలో విజయాలకు కారణం అక్కడి పరిశోధనా సంస్థలేనని ఆయన ఉదహరించారు. హైదరాబాద్‌లో 50 పరిశోధనా సంస్థలను అనుసంధానం చేస్తూ రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్) ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. రిసెర్చ్ ఫలితాలు మార్కెట్లోకి రావడానికి ‘రిచ్’ సంస్థ కృషి చేస్తోందన్నారు.
రానున్న రోజుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద కంపెనీల నుంచి కాకుండా స్టార్ట్‌ప్‌ల నుంచే వస్తాయని, అందుకే తమ ప్రభుత్వం ఈ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నదని వివరించారు. పరిశోధనా రంగంలో టీవర్క్స్, రిచ్‌లతో భాగస్వాములయ్యేందుకు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు. అనంతరం మంత్రి కేటీఆర్ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభుతో సమావేశమయ్యారు.

చిత్రం..దావోస్‌లో శనివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు