బిజినెస్

ఎనిమిదో వారమూ లాభాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 27: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో వారం పుంజుకున్నాయి. ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 538.86 పాయింట్లు పుంజుకొని, 36,050.44 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 11,069.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. జనవరి నెల సిరీస్ ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్‌ల కాల పరిమితి ముగుస్తుండటంతో గురువారం మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల కీలక సూచీలు పడిపోవడం మినహా ఈ వారమంతా మార్కెట్లు లాభాల్లోనే సాగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల దేశీయ మార్కెట్లపై కొంత ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, మార్కెట్లలోకి భారీగా పెట్టుబడులు తరలి రావడంతో పాటు ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా మదుపరులలో విశ్వాసాన్ని పాదుగొలిపింది. విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) భారత మార్కెట్లలోకి పెద్ద మొత్తంలో నిధులను తరలించడం, మూడో త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల లాభాలు ఆశించిన దానికన్నా మించి నమోదు కావడం, ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్‌పై మదుపరులు ఆశాజనకంగా ఉండటం వల్ల ఈ వారంలో మార్కెట్లు బాగా పుంజుకొని, సెనె్సక్స్ 36,000 మైలురాయిని, నిఫ్టీ 11,000 కీలక స్థాయిని అధిగమించాయి. అయితే మదుపరులు గురువారం లాభాల స్వీకరణకు పూనుకోవడంతో జీవనకాల గరిష్ఠ స్థాయిల నుంచి సూచీలు పడిపోయినప్పటికీ, మొత్తం మీద ఈ వారంలో సూచీలు లాభపడ్డాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు.
సెనె్సక్స్ ఈ వారంలో 35,613.97 పాయింట్ల వద్ద ప్రారంభమయి, మైలురాయి గరిష్ఠ స్థాయి 36,268.19 పాయింట్లు, కనిష్ట స్థాయి 35,544.68 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారంతో పోలిస్తే 538.86 పాయింట్ల (1.52 శాతం) లాభంతో 36,050.44 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్ క్రితం ఏడు వారాల్లో కలిపి 3,039.73 పాయింట్లు (9.26 శాతం) పుంజుకుంది. నిఫ్టీ ఈ వారం 10,883.20 పాయింట్ల వద్ద ప్రారంభమయి, మైలురాయి గరిష్ఠ స్థాయి 11,110.10, కనిష్ట స్థాయి 10,881.40 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారంతో పోలిస్తే 174.95 పాయింట్ల (1.61 శాతం) లాభంతో 11,069.65 పాయింట్ల వద్ద స్థిరపడింది.
ఈ వారం ఐటీ, మెటల్, చమురు- సహజ వాయువు, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకులు, టెక్నాలజి, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆరోగ్య సంరక్షణ, స్థిరాస్తి, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు మదుపరులను ఎక్కువగా ఆకర్షించాయి. మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో కన్స్యూమర్ డ్యూరేబుల్స్, ఐపీఓలు, వాహన, విద్యుత్తు రంగాల షేర్ల ధరలు పడిపోయాయి.