బిజినెస్

ఆలోచనొచ్చింది.. ఆకారం మారింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/టోక్యో, జూన్ 11: మారుతున్న వ్యాపార ఆలోచనలు.. సాగుబడి విధానాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. రవాణాకు అనువైనట్లుగా పంట రూపురేఖలను మార్చేస్తున్నారు మరి. విదేశాల్లో ముఖ్యంగా జపాన్‌లో వివిధ రకాల పండ్లు, కూరగాయలను అనేక ఆకృతుల్లో పండించి ఔరా అనిపిస్తున్నారు అక్కడి వ్యవసాయ శాస్తవ్రేత్తలు, రైతులు. ఏదైనా పండు, కూరగాయల పేరు చేబితే టక్కున దాని రూపం మన మదిలో మెదులుతుంది. కానీ ఆ రోజులు పోయాయిప్పుడు. గుండ్రంగా కాకుండా చతురస్రాకారంలో పండిస్తున్నారు. పుచ్చకాయ, యాపిల్, కర్బూజ పండ్ల ఆకారాలు డబ్బాల మాదిరిగా ఉంటున్నాయి. నారింజతోపాటు మరికొన్ని పండ్ల రూపాలనూ మార్చేశారు. దీనికి కారణం మెరుగైన రవాణానే. అవును.. ఈ కారణం చేతనే పండ్ల ఆకారాలు మారిపోతున్నాయి. చతురస్రాకారంలో ఉంటే రవాణాకు వీలుగా ఉంటుందని, సుదూర ప్రాంతాలకూ డ్యామేజీ లేకుండా చేరతాయని వ్యాపారవేత్తలు చెబుతున్నారు. అడ్డదిడ్డంగా ఉండే ఆకారాల్లో ఉన్న పండ్లను, కూరగాయలను రవాణా చేయడం కష్టంగా ఉంటోందని, కాయలకు మధ్య ఖాళీలు ఉండి డ్యామేజీకి ఆస్కారం ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే చతురస్రాకారంలో సాగుబడికి ప్రాధాన్యతనిస్తున్నట్లు వివరిస్తున్నారు. వినియోగదారులను ఆకర్షించేందుకు చతురస్రాకారంలోనేగాకుండా దీర్ఘచతురస్రాకారం, వి ఆకారంలో, లవ్ సింబల్‌లో ఇలా కోరుకున్న ఆకారంలోనూ పండ్లను పండిస్తున్నారు రైతులు. ఇందుకు వారు అధికంగానే శ్రమిస్తున్నారు. తొలుత సాధారణ పంట మాదిరిగానే ఎదగనిస్తారు. ఆ తర్వాత పంట ఓ దశకు చేరగానే ఒక్కో కాయకు ఒక్కో బాక్సు చొప్పున కావాల్సిన ఆకారాలుగల బాక్సులను బిగిస్తారు. దీంతో ఆ కాయ ఎదుగుతూ క్రమేణా ఆ బాక్సు ఆకారంలోకి మారిపోతుంది. బాక్సులన్నీ ఒకే కొలతలో ఉంటాయి కాబట్టి రవాణాకు వీలుగా ఉంటుంది. ఇక భారత్‌లో ఈ కొత్త తరహా సేద్యం ఇంకా లేనప్పటికీ జపాన్, చైనా తదితర దేశాల్లో ఇది బాగానే విస్తరిస్తుండటం, ఈ రకమైన పండ్లకు మార్కెట్‌లోనూ మంచి డిమాండ్ ఉండటంతో ఆ తరహా సేద్యంపై భారత్ దృష్టిసారిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యాపారవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నేలలకు తగ్గట్లుగా పంట విధానంలో మార్పులు తీసుకువచ్చి అమలుచేస్తే లాభసాటిగా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి సేద్యంలో వస్తున్న మార్పులు పంట రూపురేఖలను భలే మారుస్తున్నాయి కదూ..

chitram పుచ్చకాయను బాక్సులో అమర్చుతున్న రైతులు