బిజినెస్

రూ.97,932కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)లోని టాప్ టెన్ పెద్ద కంపెనీలలో తొమ్మిది సంస్థల మొత్తం మార్కెట్ విలువ గురువారంతో ముగిసిన వారంలో రూ. 97,931.85 కోట్లు పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) గరిష్ఠ లాభాలతో ముందంజలో నిలిచాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్), ఓఎన్‌జీసీలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్)ను బాగా పెంచుకున్న కంపెనీలలో ఉన్నాయి. బీఎస్‌ఈలోని అత్యధిక విలువయిన తొలి పది కంపెనీలలో ఒక్క మారుతి సుజుకి ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ మాత్రమే ఈ వారంలో పడిపోయింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. అందువల్ల గురువారం నాటి వరకు జరిగిన ఈ వారం లావాదేవీల్లో టీసీఎస్ మార్కెట్ విలువ రూ. 31,222.03 కోట్ల పెరుగుదలతో రూ. 5,96,846.16 కోట్లకు పెరిగింది. దీంతో టాప్ టెన్ కంపెనీలలో టీసీఎస్ ఈ వారంలో అత్యధికంగా లబ్ధి పొందిన సంస్థగా నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 22,295.4 కోట్లు పుంజుకొని, రూ. 6,10,938.21 కోట్లకు చేరుకుంది. ఓఎన్‌జీసీ మార్కెట్ విలువ రూ. 18,800.69 కోట్లు పెరిగి, రూ. 2,67,252.12 కోట్లకు చేరుకుంది. ఐటీసీ మార్కెట్ విలువ రూ. 8,533.32 కోట్లు పుంజుకొని, రూ. 3,42,368.98 కోట్లకు పెరిగింది. ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6,016.78 కోట్లు పెరిగి, రూ. 2,55,696.84 కోట్లకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 5,316.73 కోట్లు పుంజుకొని, రూ. 5,10,701.65 కోట్లకు పెరిగింది. ఎస్‌బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3,539.14 కోట్లు పెరిగి, రూ. 2,70,312.76 కోట్లకు చేరుకుంది. హెచ్‌యూఎల్ మార్కెట్ విలువ రూ. 1,872.27 కోట్లు పుంజుకొని, రూ. 2,96,739.30 కోట్లకు పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 335.49 కోట్లు పెరిగి, రూ. 3,03,949.77 కోట్లకు చేరింది. మరోవైపు, మారుతి ఎం-క్యాప్ రూ. 1,333.69 కోట్లు పడిపోయి, రూ. 2,80,245.71 కోట్లకు తగ్గింది. ఈ టాప్ టెన్ సంస్థల్లో రిల్ మొదటి స్థానంలో నిలవగా, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, మారుతి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్ తరువాత స్థానాల్లో నిలిచాయి.