బిజినెస్

అరకు కాఫీ ఆస్వాదించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 29: అరకు వ్యాలీ ఇన్‌స్టంట్ కాఫీ సేవించి, రుచి చూసి ఆస్వాదించి గిరిజనులను ఆదుకోవాలని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. వెలగపూడి సచివాలయం 3వ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ సమావేశ మందిరంలో సోమవారం మధ్యాహ్నం ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్‌తో కలిసి ఆయన అరకు వ్యాలీ ఇన్‌స్టంట్ కాఫీ 2గ్రాములు, 10గ్రాముల ప్యాకెట్లను మార్కెట్‌కు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ఉత్పత్తులతో పాటు కాఫీ గింజలను సేకరించి, ప్రాసెసింగ్ చేయించి, మార్కెటింగ్ చేసి వచ్చిన లాభాలను గిరిజనులకు అందించడమే గిరిజన సహకార సంస్థ (జీసీసీ) విధి అని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ, ప్రోత్సాహంతో 2014లో రూ.90 కోట్లు ఉన్న జీసీసీ టర్నోవర్ రెండేళ్లలో రూ.500 కోట్లకు చేరుకుందన్నారు. ఈ ఏడాది రూ.317 కోట్లు, వచ్చే రెండేళ్లలో రూ.500 కోట్లు లక్ష్యమని తెలిపారు. మూడేళ్ల నుంచి అరకు కాఫీకి ప్రాచుర్యం లభిస్తోందన్నారు. అరకు వ్యాలీ ఇన్‌స్టంట్ కాఫీ 2 గ్రాముల ప్యాకెట్లు 4లక్షలు, 10 గ్రాముల ప్యాకెట్లు లక్ష విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రెండు లక్షల ఎకరాల్లో కాఫీ సాగును ప్రోత్సహిస్తూ గిరిజనుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. గిరిజన ఉత్పత్తులను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంచడానికి రిటైల్ షాపులను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో సచివాలయంలో కూడా ఒక షాపును ఏర్పాటు చేస్తామని మంత్రి ఆనందబాబు చెప్పారు. మంత్రి జవహర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అరకు కాఫీ రుచిని ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. పోడు, గంజాయి సాగు చేసుకునే గిరిజనులను ఆదుకోవడానికి కాఫీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గిరిజన కుటుంబాలు నెలకు రూ.10వేలు సంపాదించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాఫీ ప్యాకెట్లు విడుదల సందర్భంగా అందించిన కాఫీ రుచి చూసి బాగుందని చెప్పారు. సాంఘిక సంక్షేమశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ మాట్లాడుతూ 1993 నుంచి అరకు కాఫీ మార్కెటింగ్ ప్రయత్నాలు జరుగుతున్నాయని, 25ఏళ్లకు ఆ ప్రయత్నాలు ఫలించాయని చెప్పారు. జీసీసీ ఎండీ రవిప్రకాష్ మాట్లాడుతూ మూడేళ్లలో జీసీసీ అభివృద్ధిక్రమాన్ని వివరించారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రభుత్వరంగ సంస్థ జీసీసీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న 25లక్షల మంది గిరిజనులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సేవలందిస్తున్నట్లు తెలిపారు. గిరిజన ఉత్పత్తుల అమ్మకాల్లో జీసీసీ అగ్రగామిగా ఉందన్నారు. కాఫీ డీలర్లు అరకు వ్యాలీ ఇన్‌స్టంట్ కాఫీ ప్యాకెట్ల కోసం అడ్వాన్స్‌గా రూ.30లక్షల చెక్‌ని మంత్రి ఆనందబాబుకు అందజేశారు.
ట్రైకార్ అమలుపై ఆనందబాబు సమీక్ష
లక్ష ఎకరాల్లో కాఫీ అభివృద్ధికి సంబంధించి మొదటి మూడు సంవత్సరాల్లో కాఫీ సాగుచేసే గిరిజన రైతులను గుర్తించాలని సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయం 3వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్‌లో సోమవారం సాయంత్రం మంత్రి గిరిజన సంక్షేమశాఖ, ట్రైకార్ (ట్రైబల్ కార్పొరేషన్) పథకాల అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 11ఏళ్లకు ప్రతిపాదించిన కాఫీ ప్రాజెక్టును ఏడు సంవత్సరాలకు పూర్తిచేసే విధంగా ప్రణాళికలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. కాఫీ అభివృద్ధికి సంబంధించి ప్రొఫెషనల్ ఏజెన్సీతో సవివర ప్రాజెక్టు ప్రతిపాదనలను తయారుచేసి, వచ్చే నెలలో సమర్పించాలని ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం, ఈ సంవత్సరంలో మంజూరు చేసిన బ్యాంకు లింక్ పథకాలను ఫిబ్రవరి నెలాఖరులోగా గ్రౌండ్ చేయాలన్నారు. 2014-15, 2015-16లో గ్రౌండ్ చేయని పథకాల సబ్సిడీ నిధులను వెనక్కి తీసుకొని ట్రైకారుకు జమచేయాలని ఆదేశించారు.

చిత్రం..అరకు ఇన్‌స్టంట్ కాఫీ ప్యాకెట్లను విడుదల చేస్తున్న ఏపీ మంత్రులు ఆనందబాబు, జవహర్