బిజినెస్

మార్కెట్‌కు ఆర్థిక సర్వే దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 29: భారత్ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం బాగా పుంజుకుంటుందని ఆర్థిక సర్వే వెల్లడించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. ఆర్థిక సర్వే దన్నుగా మార్కెట్లలో కొనుగోళ్లు పుంజుకొని కీలక సూచీలు మళ్లీ సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిలకు చేరాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 233 పాయింట్లు పెరిగి, సరికొత్త రికార్డు గరిష్ఠ స్థాయి 36,283.25 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 11,130.40 పాయింట్ల వద్ద స్థిరపడింది. భారత్ తిరిగి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, ప్రస్తుతం 6.75 శాతంగా ఉన్న దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7నుంచి 7.5 శాతం వరకు పెరుగుతుందని సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే వెల్లడించింది. సానుకూల ఆర్థిక సర్వే గణాంకాలతో పాటు ఫిబ్రవరి నెల డెరివేటివ్‌ల కాంట్రాక్టులు మొదలు కావడం, దేశీయ మార్కెట్‌లోకి విదేశీ నిధులు నిరంతరాయంగా రావడం, మూడో త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీలు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించడం మదుపరుల్లో విశ్వాసాన్ని పెంపొందించాయి. సోమవారం ఉదయం అధిక స్థాయిల వద్ద ప్రారంభమైన సెనె్సక్స్ తరువాత మరింత పుంజుకొని ఇంట్రా-డేలో ఆల్-టైమ్ హై 36,443.98 పాయింట్లను తాకింది. అయితే, తరువాత మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో కొంత తగ్గిన సెనె్సక్స్ చివరకు క్రితం సెషన్ ముగింపుతో పోలిస్తే 232.81 పాయింట్ల (0.65 శాతం) లాభంతో 36,283.25 పాయింట్ల వద్ద ముగిసింది. జనవరి 24న సృష్టించిన గరిష్ఠ రికార్డు ముగింపు 36,161.64 పాయింట్లను అధిగమించింది.
50 షేర్లతో కూడిన నిఫ్టీ సోమవారం క్రితం సెషన్ ముగింపుతో పోలిస్తే 60.75 పాయింట్లు (0.55 శాతం) పుంజుకొని, 11,130.40 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ సూచీ కూడా జనవరి 24న సృష్టించిన గరిష్ఠ రికార్డు ముగింపు 11,086 పాయింట్లను అధిగమించింది. అన్నీ సానుకూల అంశాలే అయినప్పటికీ, షేర్ల ధరలు హెచ్చు స్థాయికి చేరడంతో మదుపరులు మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించారు. ఇదిలా ఉండగా, గురువారం విదేశీయులు నికరంగా రూ. 937.31 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 965.67 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.
సోమవారంనాటి లావాదేవీల్లో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి అత్యధికంగా లబ్ధి పొందింది. 2017 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో నికర లాభాల్లో 2.96 శాతం పెరుగుదలను నమోదు చేసిన ఈ కంపెనీ షేర్ ధర 3.85 శాతం పెరిగింది. అలాగే, మూడో త్రైమాసికంలో నికర లాభాన్ని రెండింతలు పెంచుకున్న హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ షేర్ ధర కూడా 2.66 శాతం పుంజుకుంది. సోమవారం షేర్ల ధరలు పెరిగిన ఇతర సంస్థల్లో టీసీఎస్, హీరో మోటోకార్ప్, కోటక్ మహీంద్ర బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్ ఫార్మా, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్, ఎంఅండ్‌ఎం, విప్రో, కోల్ ఇండియా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్ ఉన్నాయి. వీటి షేర్ల ధరలు 2.48 శాతం వరకు పెరిగాయి. అయితే, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరి, భారతి ఎయిర్‌టెల్, ఐటీసీ, యెస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐల షేర్ల ధరలు 5.92 శాతం వరకు పడిపోయాయి.