బిజినెస్

పాస్‌పోర్టు సేవల విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 30: విదేశాలకు వెళ్ళే వారి సంఖ్య పెరుగుతున్నందున పాస్‌పోర్ట్ సేవలను మరింతగా విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా పోస్ట్ఫాసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలను (పీఓపిఎస్‌కె)లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అదీ పాస్‌పోర్ట్ ప్రధాన కార్యాలయాలకు అనుసంధానం చేస్తూ వీటిని నిర్వహించేందుకు రంగం చేస్తోంది. పోస్ట్ఫాసుల ద్వారానే పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలను నిర్వహిస్తే చాలావరకు అభ్యర్థుల సమస్యలు తీరుతాయని భావించిన కేంద్రం దేశవ్యాప్తంగా 236 పోస్ట్ఫాసు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 25కి పైగానే ఇవి ఏర్పాటు కానుండగా, ఆంధ్రాలో పది వరకు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పాస్‌పోర్ట్‌ల జారీలో పారదర్శకతను పెంచి ఎటువంటి అక్రమాలకు తావులేకుండా అభ్యర్థులకు సులభంగా వీటిని అందించేందుకు వీలుగా పోస్ట్ఫాస్‌ల ద్వారా పాస్‌పోర్టులు జారీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మార్చి నెలాఖరికి ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడంలో భాగంగా ప్రతి ఒక్క పోస్ట్ఫాసులో పాస్‌పోర్ట్ సేవల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. దీని పర్యవేక్షణకు పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి ఓ అధికారిని మాత్రమే నియమిస్తారు. ఏపీలో భీమవరం, విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఈ తరహా లఘు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.