బిజినెస్

సామాన్యులకు అందుబాటులో సినిమా టికెట్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 31: సినిమా టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని బుధవారం సచివాలయంలో జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రోడ్డు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు సమావేశంలో పాల్గొన్నారు. సినిమా టికెట్ ధరలపై అధఇకారులతో మంత్రుల బృందం చర్చించింది. టికెట్ ధరలపై ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఫిబ్రవరి 14వ తేదీన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సంఘాల ప్రతినిధులతో భేటీ కావాలని సమావేశంలో నిర్ణయించారు. ఆన్‌లైన్ టికెట్ అమ్మకాలపై కూడా మంత్రుల బృందం చర్చించింది. పన్ను వసూలు మరింత పారదర్శకంగా ఉండేందుకు రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ నోడల్ ఏజెన్సీగా ఆన్‌లైన్ టికెట్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డి.సాంబశివరావు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనూరాధ, రాష్ట్ర చలనచిత్ర, టీవీ నాటక అభివృద్ధి సంస్థ ఎండీ ఎస్.వెంకటేశ్వర్ తదితర అధికారులు పాల్గొన్నారు.