బిజినెస్

గోదావరికి అడ్డుకట్ట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జనవరి 31: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం గోదావరి నదికి అడ్డుకట్టవేసే పనులను బుధవారం ప్రారంభించారు. మొత్తం 1427 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పుతో భూమిలోపల నిర్మించే డయాఫ్రం వాల్ ఇప్పటివరకు 929 మీటర్ల మేర నిర్మాణం పూర్తయ్యింది. మిగిలిన 498 మీటర్ల నిర్మాణం కోసం గోదావరి నదికి అడ్డుకట్ట వేస్తున్నారు. అయితే నీటి ప్రవాహానికి వీలుగా 250 మీటర్ల నుండి 450 మీటర్ల ప్రాంతం వద్ద 200 మీటర్ల వెడల్పులో సిమెంట్ పైపులు ఏర్పాటుచేస్తున్నారు. ఈ అడ్డుకట్ట నిర్మాణం 20 రోజుల్లో పూర్తవుతుందని ప్రాజెక్టు ఈఈ ఎస్‌కే హుస్సేన్ తెలిపారు. ప్రస్తుతం గోదావరి నీరు దిగువకు 6 వేల క్యూసెక్కుల నీరు వెళ్తోందన్నారు. ఇది రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా వైపు నుండి 80వ మీటరు నుండి 225 మీటర్ల వరకు నీటి ప్రవాహం ఉందన్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ఎల్‌అండ్‌టి, జర్మనీ కంపెనీ బావర్ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం విదితమే. డయాఫ్రం వాల్ నిర్మాణం మే 30వ తేదీ నాటికి పూర్తవుతుందని ఈఈ వివరించారు. ఇలావుండగా అడ్డుకట్ట నేపథ్యంలో పోలవరం నుండి బయలుదేరే పాపికొండలు విహార యాత్ర టూరిజం బోట్లు ఇకపై తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం నుండి మాత్రమే బయలుదేరతాయి.