బిజినెస్

కేటీపీఎస్ 7వ దశలో విజయవంతంగా లైటప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, జనవరి 31: రూ.5,500 కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల సామర్థ్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్మిస్తున్న కేటీపీఎస్ 7వ దశలో బుధవారం చేసిన లైటప్ విజయవంతమైంది. అనుకున్న సమయానికంటే ముందుగానే నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న బాయిలర్ విభాగంలో టీఎస్ జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు కంప్యూటర్ ద్వారా లైటప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాయిలర్‌లో లోడెన్స్ ఆయిల్‌తో బుధవారం ఉదయం 7.35 నిమిషాలకు ప్రయెగాత్మక పరిశీలన చేయగా బాయిలర్ నుండి సుమారు 20 నిమిషాల పాటు పొగలు విరజిమ్మాయి. దీంతో కేటీపీఎస్ అధికారుల్లో, కార్మికుల్లో, బీహెచ్‌ఇఎల్ అధికారుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. నిర్దేశించిన సమయానికంటే ముందుగా కర్మాగారంలో లైటప్ విజయవంతం కావడంతో కార్మికులు, ఉద్యోగులు స్వీట్లు పంచుకున్నారు. అనంతరం సీఎండీ 7వ దశలోని కొన్ని విభాగాల్లో శరవేగంగా జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. కేటీపీఎస్, బీహెచ్‌ఎల్ అధికారులు సంయుక్తంగా ఇదే స్ఫూర్తితో ముందుకు పోతూ సింక్రనైజేషన్ జరిగే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో, కేటీపీఎస్, బీహెచ్‌ఇఎల్ అధికారులు పాల్గొన్నారు.
సీఎండీని అభినందించిన
సీఎం కేసిఆర్, ఎంఎల్‌ఏ జలగం
కేటీపీఎస్ 7వ దశలో నిర్దేశించిన సమయానికంటే ముందుగానే కర్మాగారంలోని బాయిలర్ నిర్మాణ పనులను పూర్తి చేసి విజయవంతంగా లైటప్ నిర్వహించిన టీఎస్ జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావును రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్, కొత్తగూడెం శాసనసభ్యుడు జలగం వెంకట్రావు అభినందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణం చేసుకొంటున్న విద్యుత్ కేంద్రాల్లో ఇదే తరహాలో పనులను పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చూడాలని కోరారు.