బిజినెస్

2015-16 జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్‌ఓ) బుధవారం 2015-16 ఆర్థిక సంవత్సర స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును 8 శాతం నుంచి 8.2 శాతానికి సవరించింది. 2016-17 ఆర్థిక సంవత్సర వృద్ధి రేటును మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా 7.1 శాతంగానే ఉంచింది. వాస్తవ జీడీపీ 2016-17లో రూ. 121.96 లక్షల కోట్లు, 2015-16లో రూ. 113.86 లక్షల కోట్లు నమోదయిందని, ఈ రెండు ఆర్థిక సంవత్సరాలలో జీడీపీ వృద్ధి రేటు వరుసగా 7.1 శాతం, 8.2 శాతం చొప్పున నమోదయిందని సీఎస్‌ఓ ఒక ప్రకటనలో వెల్లడించింది.