బిజినెస్

36వేల స్థాయిని కోల్పోయిన సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 31: మరో 24 గంటల్లో పార్లమెంటు ముందుకు కేంద్ర బడ్జెట్ రానున్న తరుణంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించి కొనుగోళ్లకు దూరంగా ఉండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ కీలకమైన 36,000 పాయింట్ల స్థాయికన్నా దిగువన ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా పతనమయినప్పటికీ, కీలకమయిన 11,000 పాయింట్ల స్థాయికిపైన స్థిరపడగలిగింది. మదుపరులు వరుసగా రెండో రోజు బుధవారం కూడా అప్రమత్తంగా వ్యవహరించి, తమ పోర్ట్ఫోలియోలను విస్తరించుకోకుండా మరిన్ని సానుకూల అంశాల కోసం బడ్జెడ్‌వైపు ఎదురు చూశారని ట్రేడర్లు తెలిపారు. సెనె్సక్స్ బుధవారం సెషన్‌లో ఎక్కువ సమయం ప్రతికూల ధోరణిలోనే సాగి, క్రితం సెషన్ ముగింపుతో పోలిస్తే 68.71 పాయింట్లు (0.19 శాతం) దిగజారి, 35,965.02 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ ఇంట్రా-డేలో 35,818.41 పాయింట్ల కనిష్ట స్థాయి, 36,050.69 పాయింట్ల గరిష్ఠ స్థాయి మధ్య కదలాడింది. సెనె్సక్స్ తన జీవనకాల గరిష్ఠ స్థాయి నుంచి మంగళవారం 249.52 పాయింట్లు పడిపోయిన విషయం విదితమే. నిఫ్టీ బుధవారం ఇంట్రా-డేలో 10,979.30 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకి, తరువాత కొంత పుంజుకొని చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 21.95 పాయింట్ల (0.20 శాతం) దిగువన 11,027.70 పాయింట్ల వద్ద స్థిరపడింది.
అయితే, నెలవారీగా చూస్తే సెనె్సక్స్ ఈ నెలలో 1,908.19 పాయింట్లు (5.60 శాతం) పెరగగా, నిఫ్టీ 497 పాయింట్లు (4.71 శాతం) పుంజుకుంది. ఇదిలా ఉండగా, మంగళవారం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా 105.56 కోట్ల విలువయిన షేర్లను, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 281.65 కోట్ల విలువ గల షేర్లను విక్రయించారు.
బుధవారం లావాదేవీల్లో సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరి బాగా నష్టపోయింది. ఈ సంస్థ షేర్ విలువ 3.75 శాతం పడిపోయింది. 3.49 శాతం నష్టంతో టాటా స్టీల్ రెండో స్థానంలో నిలిచింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో హెచ్‌యూఎల్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, ఐటీసీ లిమిటెడ్, టీసీఎస్, విప్రో, ఎల్‌అండ్‌టీ, పవర్ గ్రిడ్, మారుతి సుజుకి, భారతి ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 2.62 శాతం వరకు పడిపోయింది. అయితే, మార్కెట్‌లో ప్రతికూల ధోరణిని అధిగమించి కోటక్ మహీంద్ర బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, యెస్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాలను ఆర్జించాయి.
రంగాల వారీగా చూస్తే, బీఎస్‌ఈ హెల్త్‌కేర్ ఇండెక్స్ అత్యధికంగా 1.62 శాతం పడిపోయింది. తరువాత స్థానాల్లో ఎఫ్‌ఎంసీజీ 1.25 శాతం, మెటల్ 1.25 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.12 శాతం, ఐటీ 1.10 శాతం, కన్స్యూమర్ డ్యూరేబుల్స్ 0.98 శాతం, టెక్ 0.86 శాతం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 0.56 శాతం, పీఎస్‌యూ 0.39 శాతం చొప్పున నష్టపోయాయి. అయితే, చమురు- సహజ వాయువు, బ్యాంకెక్స్ సూచీలు లాభాల్లో నిలవగలిగాయి.