బిజినెస్

ధర పెరిగేవీ.. తగ్గేవి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: పార్లమెంటులో 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మేక్‌ఇన్ ఇండియాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచారు. కేంద్రం ఇటీవలే జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చినందున ధరలపై బడ్జెట్ ప్రభావం తక్కువగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే జైట్లీ బడ్జెట్‌వల్ల ఏయే వస్తువులపై ధరలు పెరిగిందీ చూద్దాం..
ధరలు పెరిగేవి: కార్లు, మోటర్ సైకిళ్లు, మొబైల్ ఫోన్లు, వెండి, బంగారం, దిగుమతి చేసుకునే కూరగాయాలు, పండ్ల రసాలు, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, సన్‌గ్లాసెస్ (గాగుల్స్), వంటల్లో వాడుకునే ఫుడ్ ప్రిపరేటీవ్‌లు, పెర్‌ఫ్యూమ్స్, టాయిలెట్ వాటర్, సన్‌స్క్రీన్, మేనీక్యూర్, పెడిక్యూర్ ప్రిపరేషన్స్, ఓరల్ డెంటల్ హైజీన్, డెంట్యూర్ ఫిక్యేటీవ్, పేస్టులు, పౌడర్లు, షేవింగ్ క్రీమ్‌లు, ఆఫ్టర్ షేవ్ లోషన్లు, డియోడరెంట్లు, బాత్ ప్రిపరేషన్లు, సెంట్ స్పేయర్లు, టాయిలెట్ స్పేయర్లు, ట్రక్, బస్సు టైర్లు, సిల్క్ ఫ్యాబ్రిక్స్, ఫుట్‌వేర్, రంగు రాళ్లు, డైమండ్స్, ఇమిటేషన్ జువెలరీ, స్మార్ట్ వాచీలు/ ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ/ఎల్‌సీడీ టీవీ ప్యానెల్స్, ఫర్నీచర్, పరుపులు, రిస్ట్‌వాచీలు/పాకెట్ వాచీలు/ గోడ గడియారాలు, మూడు చక్రాల సైకిళ్లు, స్కూటర్లు, ఆట బొమ్మలు, వీడియో గేమ్స్, క్రీడాసామగ్రి, అవుట్‌డోర్ గేమ్స్, సిగరెట్లు, లైటర్లు, కేండిల్స్, గాలిపటాలు, ఎడిబుల్/విజటేబుల్ ఆయుల్స్, ఆలీవ్ ఆయుల్, వేరుసెనగ నూనె.
ధరలు తగ్గేవి: ముడి జీడిపప్పు, సోలార్ టెంపర్డ్ గ్లాస్, మాన్యుఫాక్చర్స్ ఆఫ్ సోలార్ ప్యానల్స్/మాడ్యులర్స్, వినికిడి ప్రయోగాలకు వినియోగించే వస్తువులు, స్క్రూలు, సీఎన్‌జీ మిషన్ టూల్స్.