బిజినెస్

వచ్చేదిలా.. పోయేదలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రతిపాదించిన 2018-19 వార్షిక బడ్జెట్ లోతుగా పరిశీలిస్తే ప్రతి రూపాయిలో 19 పైసలు అప్పుల ద్వారానే లభిస్తుందన్న విషయం స్పష్టమవుతోంది. వడ్డీ చెల్లింపులపై 18 పైసలు వెచ్చించనుంది. ఆదాయంగా వచ్చిన ప్రతి రూపాయలో 70 పైసలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారానే లభిస్తుంది. ఇక ఖర్చుల విషయానికి వస్తే పన్నుల్లో, సుంకాల్లో రాష్ట్రాల వాటా 24 పైసలు. అయితే వడ్డీ చెల్లింపులు 18 పైసలు వరకూ ఉంటుంది. రక్షణ కేటాయింపులు 9 పైసలకే పరిమితమయ్యాయి. జీఎస్టీ ద్వారా ప్రతి రూపాయలో 23 పైసల ఆదాయం లభిస్తుందని ఆర్థిక మంత్రి అంచనా వేస్తున్నారు.
అలాగే కార్పొరేషన్ పన్ను ద్వారా వచ్చే మొత్తం 19 పైసలు వరకూ ఉండొచ్చని, ఆదాయం పన్ను వసూళ్లు కూడా 19 పైసలు వరకూ ఉండొచ్చని తెలిసింది. కస్టమ్స్ సుంకాల ద్వారా 4 పైసల ఆదాయం ప్రభుత్వానికి లభించనుంది. పెట్టుబడుల ఉపసంహరణ వంటి వాటి ద్వారా 8 పైసల వరకూ పన్నులతో సంబంధం లేని ఆదాయ పొందవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఎన్‌డీసీల ద్వారా మరో 3 పైసల మొత్తాన్ని సమకూర్చుకోవచ్చుననీ భావిస్తోంది.