బిజినెస్

నిజాయితీకి పట్టంకట్టాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా పన్నులు చెల్లించేవారికి పట్టంకట్టిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. 2006లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నిజాయితీగా పన్ను చెల్లించేవారికి సరైన ప్రాధాన్యత, గౌవరం ఇవ్వాలన్నదేనని స్పష్టం చేశారు. వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించేవారి సంఖ్య గతంలో ఎన్నడూలేని విధంగా భారీగా పెరిగిందని పేర్కొన్న ఆయన, భవిష్యత్‌లో కూడా ఇందుకు సంబంధించి అనేక ప్రోత్సాహక నిర్ణయాలు తీసుకుంటామని తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. నల్లధనాన్ని అరికట్టడంతోపాటు నిజాయితీగా పన్ను చెల్లించేవారిని కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. పెద్దనోట్ల రద్దును కొన్ని వర్గాలు వ్యతిరేకించినా, ఆర్థిక వ్యవస్థలో తమ తోడ్పాటు అందించే ప్రతి ఒక్కరూ దీన్ని హర్షించారన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 66.26లక్షల మందికి ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తే, ఈ ఏడాది వీరి సంఖ్య 85.51 లక్షలకు పెరిగిందన్నారు. గత ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంనాటికి పన్ను చెల్లింపుదారుల సంఖ్య 8.27 కోట్లకు చేరుకుందని, 2014-15లో ఈ సంఖ్య 8.47 కోట్లని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తరువాత భారత ఆర్థిక వ్యవస్థ అన్ని విధాలుగా పుంచుకుంటోందని, డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ వల్ల లక్షిత వర్గాలకు ఉద్దేశిత ప్రయోజనాలను అందించగలుగుతున్నామని అన్నారు.
గ్రామీణ భారతమే లక్ష్యం
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు సృజనకు కేంద్రం పట్టం గట్టింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 14.34 లక్షల కోట్ల రూపాయలను దీనికి కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. ఉపాధి కల్పనతో పాటు వౌలిక సదుపాయాలను కూడా పెంపొందిస్తామని అన్నారు. ఉపాధి కల్పనతోపాటు 51 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణం, 1.88 కోట్ల టాయిలెట్ల నిర్మాణానికి ఈ నిధులు దోహదం చేస్తాయని అలాగే 1.75 కోట్ల ఇళ్లకు విద్యుత్ సదుపాయం కల్పిస్తామని జైట్లీ వెల్లడించారు. జీవనోపాధి, వ్యవసాయం, సంబంధిత కార్యకలాపాలు గ్రామీణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కల్పన వంటి వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని వెల్లడించారు. ఆలాగే జాతీయ గ్రామీణ జీవోపాధి మిషన్‌కు 5,750 కోట్లు కేటాయించినట్టు, మహిళా స్వయం సహాయక గ్రూపులకు రుణాల కోసం 2016-17 ఆర్థిక సంవత్సరంలో 42,500కోట్లు కేటాయించామని ఈ ఏడాది ఈ మొత్తం 78,000 కోట్లకు చేరుకోగలని ఆర్థిక మంత్రి తెలిపారు.