బిజినెస్

‘వ్యవసాయ కంపెనీల’ షేర్ల ధరలకు రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయడంపై 2018-19 ఆర్థిక సంవత్సర బడ్జెట్ కేంద్రీకరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్‌లో వ్యవసాయ సంబంధ కంపెనీల షేర్ల ధరలు పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)లో ఎన్‌ఏసీఎల్ ఇండస్ట్రీస్ షేర్ ధర 9.64 శాతం, పీఐ ఇండస్ట్రీస్ షేర్ విలువ 6.49 శాతం, శక్తి పంప్స్ ఇండియా షేర్ ధర 5.89 శాతం, యాక్షన్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ షేర్ విలువ 5.66 శాతం, మోన్‌సాంటో ఇండియా షేర్ ధర 4.84 శాతం చొప్పున పెరిగాయి. అలాగే ఏరియెస్ ఆగ్రో షేర్ ధర 4.99 శాతం, ధనుక అగ్రిటెక్ షేర్ విలువ 3.89 శాతం, కావేరి సీడ్ కంపనీ షేర్ ధర 3.4 శాతం, యూపీఎల్ షేర్ విలువ 2.61 శాతం చొప్పున పుంజుకున్నాయి.
‘్ఫడ్ ప్రాసెసింగ్’ షేర్లలో ర్యాలీ
వచ్చే ఆర్థిక సంవత్సరం ఆహార తయారీ రంగానికి కేటాయింపులు దాదాపు రెండింతలు చేస్తూ, రూ. 1,400 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్‌లో ప్రతిపాదించడంతో గురువారం స్టాక్ మార్కెట్‌లో ఈ రంగానికి చెందిన షేర్ల ధరలు బాగా పెరిగాయి. బీఎస్‌ఈలో అవంతి ఫీడ్స్ షేర్ ధర 14.41 శాతం, శీతల్ కూల్ ప్రొడక్ట్స్ షేర్ విలువ 8.59 శాతం, గోద్రెజ్ ఆగ్రోవెట్ షేర్ ధర 6.83 శాతం, ఫ్రెష్‌ట్రాప్ ఫ్రూట్స్ షేర్ విలువ 6.75 శాతం చొప్పున పెరిగాయి.
పడిపోయిన బ్రోకింగ్ కంపెనీల షేర్ల విలువ
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రూ. ఒక లక్షకు మించి ఆర్జించిన లాభాలపై పది శాతం లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నును ప్రవేశపెడుతూ బడ్జెట్‌లో ప్రతిపాదించడంతో గురువారం స్టాక్ మార్కెట్‌లో బ్రోకింగ్ కంపనీల షేర్ల విలువ అయిదు శాతం వరకు పడిపోయింది. బీఎస్‌ఈలో రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ షేర్ విలువ 4.95 శాతం, ఆదిత్య బిర్లా మనీ షేర్ ధర 2.18 శాతం, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ విలువ 1.63 శాతం, డీబీ ఇంటర్నేషనల్ స్టాక్ బ్రోకర్స్ షేర్ ధర ఒక శాతం చొప్పున తగ్గాయి