బిజినెస్

ఆదాయ పన్నులో మార్పులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పన్ను శ్లాబుల్లోగాని, రేట్లలోగాని ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ప్రస్తుతంమున్న రవాణా అలవెన్స్‌లు, ఇతర వైద్యపరమైన ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌కు బదులుగా 40వేల రూపాయలను ప్రామాణిక మినహాయింపుగా ప్రతిపాదిస్తున్నట్టు ఆయన వివరించారు. దీనివల్ల దాదాపు 8వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వంపై భారం పడుతుంది. ఉద్యోగవర్గాలకు అందించే ఈ స్టాండర్డ్ డిడక్షన్‌ను 2006-07 సంవత్సరంలోనే తొలగించారు. వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లకు సంబంధించి ప్రభుత్వం అనేక సానుకూల మార్పులు చేసిందని జైట్లీ తెలిపారు. గత మూడేళ్లుగా ఈ మార్పులను అమలు చేస్తున్నామన్నారు. దీనిదృష్ట్యానే వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్ల విషయంలో ఎలాంటి మార్పూ చేయడం లేదని వివరించారు. ఉద్యోగవర్గాల కంటే కూడా వ్యక్తిగత వ్యాపార వర్గాల ఆదాయం ఎక్కువన్న భావన సమాజంలో ఉందని పేర్కొన్న జైట్లీ, ఉద్యోగ వర్గాల నుంచే భారీగా పన్నులు వసూలవుతున్నాయని వివరించారు. 2016-17లో 1.89కోట్ల మంది ఉద్యోగులు 1.44 లక్షల కోట్ల రూపాయల మేర పన్నులు చెల్లించారని, అంటే ఒక్కో వ్యక్తి సగటున 76,300 రూపాయల పన్నును ప్రభుత్వానికి కట్టాడని తెలిపారు. తాజా నిర్ణయం వల్ల రెండున్నర కోట్ల మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.