బిజినెస్

సిమెంట్ రంగంలో రామ్‌కో రూ.2000 కోట్ల పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: దిగ్గజ సిమెంట్ కంపెనీ రామ్‌కో ఏపీలో నూతన ప్లాంట్ ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న మూడు ప్లాంట్‌లను విస్తరించనుంది. రూ.2000 కోట్ల పెట్టుబడులతో కొత్తగా కర్నూలు జిల్లాలో రెండు దశల్లో నూతన ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు కంపెనీ సలహాదారు గోపాలకృష్ణ ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్ 1.6 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో పనిచేస్తుందని, భవిష్యత్‌లో దీన్ని మరో 1.6మిలియన్ టన్నులకు విస్తరిస్తామని తెలిపారు. అలాగే ప్రస్తుతం కర్నూలు జిల్లా పొలిమిగుండ్ల గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌ను రూ.1160 కోట్లతో 1.6 మిలియన్ టన్నుల నుంచి 3.5 మిలియన్ టన్నులకు విస్తరించనున్నట్టు వెల్లడించారు. జగ్గయ్యపేట జయంతిపురం ప్లాంట్‌ను రూ.680 కోట్లతో ప్రస్తుతం ఉన్న 3.8 మిలియన్ టన్నులకు అదనంగా మరో 1.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచనున్నట్టు తెలిపారు.