బిజినెస్

ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా ఎప్పుడో ప్రకటించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఢిల్లీ కేంద్రంగా పనిచేసే వజ్రాల వ్యాపారి ద్వారకాదాస్ ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేశాడన్న విషయాన్ని మూడేళ్ల క్రితమే గుర్తించామని, ఆ విషయాన్ని నిబంధనలు, బ్యాంకు విచారణ ప్రక్రియలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీబీఐలకు ముందే ఫిర్యాదు చేశామని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) సోమవారం నాడు ప్రకటించింది. వజ్రాల ఎగుమతి వ్యాపారం చేసే ద్వారకాదాస్ రూ.389 కోట్ల మేరకు రుణం పొం ది తిరిగి చెల్లించ లేదు. ఈ విషయాన్ని 2014 జూన్ 30న గుర్తించిన ఓబీసీ ఆ తరువాత సీబీఐ, ఆర్‌బీఐలకు ఫిర్యాదు చేసింది. కాగా ఈ కుంభకోణం వ్యవహారంవల్ల తమ బ్యాంకు లాభాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని ఓబీసీ ధీమా వ్యక్తం చేసిం ది. ద్వారకానాధ్ దాస్‌కు చెందిన సంస్థల అకౌంట్లను నాన్ పెర్ఫార్మింగ్ అస్సెట్ (ఎన్‌పీఏ)గా మారు స్తూ ఆ విషయాన్ని స్టాక్‌మార్క్‌ట్లకు 2014లోనే ఓబీసీ సమాచారం ఇచ్చిన విషయాన్ని ఇప్పుడు ఓబీసీ అధికారులు స్పష్టం చేశారు. రుణాలకు సంబంధించిన అన్ని లావాదేవీలు, తిరిగి చెల్లించేందుకు ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించిన సమాచారం అంతా నమోదై ఉన్నందున తమ బ్యాంకు లాభాలపై దీని ప్రభావం ఉండదని చెబుతున్నారు. 2007-12 సంవత్సరాల మధ్య ద్వారకాదాస్, అతడి కుటుంబ సభ్యు లు సభ్యాసేథ్, రీటాసేథ్, కృష్ణకుమార్ సింగ్, రవిసింగ్ (అందరూ డైరక్టర్లు) సంస్థల తరపున భారీగా రుణా లు పొందారు. ద్వారకాదాస్ సేథ్ సెజ్ ద్వారా లెటర్స్ ఆప్ క్రెడిట్ ద్వారా విదేశాలకు నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. డొల్ల కంపెనీల ద్వారా ఈ చెల్లింపులు జరిపినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఓబీసీ ఫిర్యాదుపై సీబీఐ ఇటీవల రుణఎగవేతదారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిం ది. తాజా కుంభకోణం నేపథ్యం లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ షేర్ల విలువ సోమవారం నాడు భారీగా పతనమైంది. బీఎస్‌ఈలో ఓబీసీ షేర్ల విలువ 10.26 శాతం పడిపోవడంతో 94.90 కోట్ల మేరకు నష్టపోయింది.