బిజినెస్

ఈ ఆర్థిక సంస్థలతో జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశంలో ఇటీవల వెలుగు చూసిన భారీ కుంభకోణాల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిథిలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ) అటు ప్రజలను, ఇటు దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేసింది. ఆర్థిక రంగాన్ని దెబ్బతీసే చర్యలను, నేరాలను అడ్డుకోవడానికి వీలుగా చర్య తీసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిర్దేశించిన విధివిధానాలను పాటించని నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లను గుర్తించి వాటి పేర్లను బహిర్గతం చేసింది. వీటిలో కోపరేటివ్ బ్యాంకులతో సహా పలు సంస్థలున్నాయి. దాదాపు 9500 నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థల పేర్లతో కూడిన జాబితాను ఎఫ్‌ఐయూ ప్రచురించింది. ఈ ఏడాది జనవరివరకు వివిధ సంస్థలు అందించిన వివరాలు పరిశీలించి ఈ వివరాలు వెల్లడించింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్-పీఎమ్‌ఎల్‌ఎ) ప్రకారం ఆయా ఆర్థిక సంస్థలు తమతమ లావాదేవీలు, చెల్లింపుల వివరాలను ఎఫ్‌ఐయూకు ఎప్పటికప్పుడు తెలియచేయాల్సి ఉంటుంది. ఆ చట్టం ప్రకారం ప్రతీ సంస్థ, పది లక్షల రూపాయలకు పైగా జరిగే అన్ని లావాదేవీలను పరిశీలించేందుకు ఒక ప్రధాన అధికారిని నియమించాల్సి ఉండగా ఆ నిబంధనకు నీళ్లు వదిలాయి. అనుమానాస్పద లావాదేవీలపై ఆ అధికారి తన నివేదికను ఎఫ్‌ఐయూకు సమర్పించాల్సి ఉంటుంది. కానీ అదేదీ జరగలేదు. ముఖ్యంగా 2016లో పెద్దనోట్ల రద్దు తరువాత ఆయా సంస్థల లావాదేవీలపై నిఘా వేసిన ఎఫ్‌ఐయూ వివిధ మార్గాల ద్వారా సేకరించిన వివరాలను సమీక్షించింది. చట్టబద్ధం కాని ఇలాంటి సంస్థలతో లావాదేవీలు జరిపే విషయంలో ప్రజలను అప్రమత్తం చేసే ప్రాథమిక చర్యల్లో భాగంగా ఈ పేర్లను ఎఫ్‌ఐయూ ప్రచురించింది. ఆయా సంస్థలతో ఆర్థిక వ్యవహారాలు నెరపడంలో ఎంత దూరం పాటిస్తే అంత మంచిదని హెచ్చరిస్తోంది.
కంపెనీ చట్టం ప్రకారం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణాలు, అడ్వాన్సుల చెల్లింపులు, షేర్లు, డిబెంచర్లు, బాండ్లు, స్టాక్స్, సెక్యూరిటీలను ఇవ్వడం, కొనుగోలు చేయడం, విక్రయించడం చేయవచ్చు. అయితే బ్యాంకుల్లా డిపాజిట్ల సేకరణ, తన పేరుమీదుగా చెక్కుల ద్వారా నగదు వసూళ్లు చేయడం చట్టవ్యతిరేకం. కానీ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఎన్‌బీఎఫ్‌సీలు ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మన ఆర్థిక వ్యవస్థలో అనేక అవకతవకలు బహిర్గతమవుతున్న నేపథ్యంలో ప్రజలను, దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేసే దిశగా ఎఫ్‌ఐయూ తాజా నివేదికను వెల్లడించింది.