బిజినెస్

లాభాల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 26: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారంనాడు లాభాల దిశగా దూసుకుపోయాయి. అంతర్జాతీయ విపణిలో సానుకూల పరిణామాల నేపథ్యంలో కొనుగోళ్లపై దేశీయ మదుపరులు ఆసక్తి చూపడంతో బీఎస్‌ఈ సెనె్సక్స్ మూడు వారాల గరిష్ఠ స్థాయి 34,445.75కు చేరుకుని 300 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా అదే తీరులో స్పందించింది. 10,555 మార్క్‌ను తాకిన సూచీ చివరకు 91.55 పాయింట్ల లాభాన్ని ఆర్జించింది. ఐరోపా, ఆసియా మార్కెట్లతోసహా వాల్‌స్ట్రీట్‌లో శుక్రవారం లావాదేవీల తీరును గమనించిన దేశీయ మదుపరులు విశ్వాసంతో సోమవారంనాడు లావాదేవీల్లో జోరుగా పాల్గొనడంతో సూచీలు లాభాల దిశగా సాగాయి. 30-షేర్ బీఎస్‌ఈ మొదటినుంచి దూకుడుగానే కొనసాగింది. 34,225.72 పాయింట్లతో మొదలైన సూచీ ఒక దశలో 34,483.39 మార్క్‌ను తాకి సాయంత్రానికి 303.60 పాయింట్ల లాభాలను నమోదు చేసింది. ఫిబ్రవరి 5వ తేదీన 34,757.16 పాయింట్లకు చేరిన తరువాత మళ్లీ ఇప్పుడే సెనె్సక్స్ చెప్పుకోదగ్గ మార్క్‌ను తాకింది. మరోవైపు 10,592.95-10,520.20 పాయింట్ల మధ్య ఊగిసలాడిన నిఫ్టీ చివరకు 10,582.60 పాయింట్ల వద్ద స్థిరపడి 91.55 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది.
స్థిరాస్థి, ఆటో, కేపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, వౌలిక వసతులు, లోహాలు, విద్యుత్, చమురు, గ్యాస్, పబ్లిక్ రంగ సంస్థలకు చెందిన షేర్ల క్రయవిక్రయాలు 3.30 మేర వృద్ధి చెందగా దేశీయ సంస్థాగత మదుపరులు ఈక్విటీల మార్కెట్‌లో 1,514.03 కోట్ల మేరకు లావాదేవీలు నిర్వహించగా విదేశీ పెట్టుబడిదారులు తమ షేర్లను 486.32 కోట్ల రూపాయల మేరకు విక్రయించారు.