బిజినెస్

ఆర్థిక వ్యవస్థకు కార్మికులే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశ ఆర్థిక అభివృద్ధిలో మెరుగైన ఫలితాలు సాధించడంలో కార్మికుల పాత్ర కీలకమైనదని ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో నైపుణ్యం, అత్యంత ప్రతిభ కనబర్చిన 338 మందికి కార్మిక, ఉపాధి కల్పన శాఖ ‘ప్రధాన మంత్రి శ్రమ్’ పురస్కారాలను అందించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకటించిన ఈ అవార్డులను ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు ఈ అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్టప్రతి వెంకయ్య మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం వేగంగా విస్తరిస్తోందని, అందులో కార్మికుల పాత్ర కీలకమైనదని అన్నారు. ఉత్పాదకతను పెంచడంలో శ్రామిక శక్తి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. కార్మిక శక్తిని మెరుగుపర్చేందుకు నాణ్యమైన శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఉందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ నావల్ డాక్‌యార్డ్‌కు చెందిన ఆర్పీ బాలన్ పిళై, ఎం.జ్యోతిరాజు, వీఏపీ వేణుసాగర్, కే పిళ్లై రాజన్ ఈ పురస్కారాలు దక్కించుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి బత్తుల కోటిరెడ్డి, క్రిప తదితరులు అవార్డులు అందుకున్నారు. తెలంగాణ నుంచి హైదరాబాద్‌లోని బ్రహ్మాస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన కే.రామ్‌ప్రసాద్, హైదరాబాద్ బిహెచ్‌ఈఎల్‌కు చెందిన సి.కుమార్, జీ.గోవర్థన్‌రెడ్డి, వెంకటేశ్వరావు, రాజేందర్‌ప్రసాద్ ఈ పురస్కరాలు అందుకున్నారు.

చిత్రం..ఢిల్లీలో సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ‘ప్రధాన మంత్రి శ్రమ్’
పురస్కారాలను అందజేస్తున్న ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు