బిజినెస్

ఫ్రీడం జార్‌కార్ ఆఫర్‌లో తిరుపతి వాసికి ఆల్టో కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 27: ఫ్రీడం రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఫ్రీడం జార్‌కార్ ఆఫర్ బంపర్ డ్రాలో తిరుపతికి చెందిన రెడ్డప్పకు మారుతీ ఆల్టో 800 ఏసీ కారు లభించింది. మంగళవారం విజయవాడలోఫ్రీడం జార్‌కార్ బంఫర్ డ్రా విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ఫ్రీడం సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఫ్రీడం జార్‌కార్ ఆఫర్‌లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రజల నుండి విశేష స్పందన లభించిందని, సుమారు 19లక్షల మంది వినియోగదారులు మూడు నెలల కాలంలో ఎంట్రీలను పంపించారని పేర్కొన్నారు. నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 31వతేదీ వరకు నిర్వహించిన ఆఫర్ బంపర్ డ్రాలో 200 మంది విజేతలకు ఒక్కొక్కరికీ 5గ్రాముల బంగారు నాణేలను అందజేశామన్నారు. నలుగురు విజేతలకు మారుతీ ఆల్టో 800 ఏసీ కార్లను అందించామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మంగళవారం అందజేశామన్నారు. వారిలో కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన కనకదుర్గ, కంచికచర్లకు చెందిన షేక్ సైదులు, చల్లపల్లికి చెందిన వెంకట శ్రీనివాసరావు, జగ్గయ్యపేటకు చెందిన పూర్ణచంద్రరావు, ఉయ్యూరుకు చెందిన దేవేందర్‌లకు బంగారు నాణేలను అందజేశారు.