బిజినెస్

దేశీయ మార్కెట్లు మళ్లీ కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: రెండు వరుస సెషన్ల పాటు ర్యాలీ చోటు చేసుకున్న దేశీయ మార్కెట్లు మంగళవారం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యా యి. కీలక స్థూలార్థిక గణాంకాలు వెలువడనున్న తరుణంలో అప్రమత్తంగా వ్యవహరించిన మదుపరులు అమ్మకాలకు పూనుకోవడంతో కీలక మార్కెట్ సూచీలు పతనమయ్యా యి. మోసపూరిత లావాదేవీలలో ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) నష్టపోయిన సొమ్ము గతంలో ప్రకటించిన రూ. 11,400 కోట్లకు మించి రూ. 12,717 కోట్ల వరకు ఉంటుందని తాజా దర్యాప్తులు వెల్లడించడంతో ప్రధానంగా బ్యాంకుల షేర్ల ధరలు మంగళవారం పతనమయ్యాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ సుమారు వంద పాయింట్లు కోల్పోయి 34,346 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 28 పాయింట్లు తగ్గింది. 2017 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో దేశ స్థూల జాతీయాభివృద్ధి (జీడీపీ) వృద్ధి గణాంకాలు సహా కీలక ఆర్థిక గణాంకాలను ప్రభు త్వం బుధవారం ప్రకటించనుండటంతో మంగళవారం మదుపరులు ఆచితూచి అడగులు వేశారు. సెనె్సక్స్ మంగళవారం ఉదయం అధిక స్థాయి 34,558.56 పాయింట్ల వద్ద ప్రారంభమయి, మరింత పైకి ఎగబాకుతూ 34,610.79 పాయింట్లకు చేరింది. అయితే, తరువాత మార్కెట్ ప్రతికూల ధోరణిలోకి వెళ్లిపోయి సెనె్సక్స్ 34,314.87 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 99.36 పాయింట్లు (0.29 శాతం) తగ్గి, 34,346.39 పాయింట్ల వద్ద ముగిసింది.
ఈ సూచీ క్రితం రెండు సెషన్లలో కలిపి 626.25 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ మంగళవారం 28.30 పాయింట్లు (0.27 శాతం) పడిపోయి 10,554.30 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఈ సూచీ ఇంట్రా-డేలో 10,631.65- 10,537.25 పాయింట్ల మధ్య కదలాడింది. ఇదిలా ఉండగా, సోమవారం నాటి లావాదేవీల్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ. 1,119.51 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 1,409.45 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు. భారీ మొత్తంలో మోసపోయిన పీఎన్‌బీ షేర్ల పతనం మంగళవారం కూడా కొనసాగింది. తాజాగా 12.11 శాతం పడిపోయిన ఈ బ్యాంకు షేర్ ధర 20 నెలల కనిష్ట స్థాయికి దిగజారింది. గీతాంజలి జెమ్స్ షేర్ ధర కూడా సుమారు అయిదు శాతం తగ్గింది. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో యాక్సిస్ బ్యాంక్ అత్యధికంగా 2.68 శాతం నష్టపోయింది. 2.46 శాతం నష్టంతో ఎస్‌బీఐ తరువాత స్థానంలో నిలిచింది. ఇతర బ్యాంకుల షేర్ల ధరలు కూడా పడిపోయాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా 1.63 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.56 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 0.95 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.83 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 0.54 శాతం, ఫెడరల్ బ్యాంక్ 0.47 శాతం చొప్పున నష్టపోయాయి. సన్ ఫార్మా, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్ వంటి సంస్థల షేర్ల విలువ కూడా పడిపోయింది.