బిజినెస్

రూ.40కే కిలో కందిపప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 1: రాష్ట్రంలోని అన్ని చౌక డిపోల్లో కిలో కంది పప్పును రూ.40కే విక్రయించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్ జేఆర్ పుష్పరాజ్ తెలిపారు.
ఈ నెల నుంచే బియ్యం, పంచదార తదితరాలతో పాటు కార్డుదారులకు ప్రతి నెలా కిలో కందిపప్పు రూ.40కు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని చౌక డిపోలో రూ.40కే కిలో కందిపప్పు పంపిణీ కార్యక్రమాన్ని గురువారం పుష్పరాజ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కోటీ 41 లక్షల తెలుపు రేషన్ కార్డుదార్లకు కిలో కందిపప్పు రూ.40కే పంపిణీచేస్తామన్నారు. ఇటీవలి కాలంలో కందిపప్పు ధర విపరీతంగా పెరుగుతున్న కారణంగా రేషన్ షాపుల్లో తగ్గింపు ధరకు లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చౌకడిపోలను ఇకనుంచి ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచివుంచాలని స్పష్టంచేశారు. సమయ పాలన పాటించని, అక్రమాలకు పాల్పడే డీలర్ల లైసెన్స్‌లు రద్దుచేస్తామని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం కిలో రూపాయికే పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియాన్ని దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేషన్ బియ్యాన్ని దొడ్డిదారిలో తరలించే అధికారులు, డీలర్లు, రైస్ మిల్లర్లను జైలుకు పంపుతామని హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పీడీఎస్ కంట్రోల్ ఆర్డర్‌లో మార్పులు తీసుకువస్తామని, ఇకనుండి ఎవరైనా పీడీఎస్ బియ్యాన్ని దుర్వినియోగం చేసినట్టు రుజువైతే వారికి నిత్యావసర సరుకుల చట్టంలోని నిబంధనలతో పాటు జైలుశిక్ష విధించేందుకు వీలుగా చట్టంలో మార్పులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పుష్పరాజ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ మల్లికార్జున, సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ కృష్ణారావు, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.