బిజినెస్

క్యూ ఎస్ వరల్డ్ రేటింగ్స్‌లో 25 భారతీయ విద్యాసంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 1: ప్రపంచంలో ఉన్నత విద్యాసంస్థలకు ప్రామాణిక సర్వేగా భావించే క్యూ ఎస్ వరల్డ్ రేటింగ్స్‌లో 25 భారతీయ ఉన్నత విద్యా సంస్థలకు చోటు దక్కింది. ప్రపంచంలో ఉత్తమ వెయ్యి విద్యాసంస్థల జాబితాను క్యూ ఎస్ వరల్డ్ గురువారం నాడు విడుదల చేసింది. ఆ జాబితాలో దేశాల వారీ చూసినపుడు భారత్‌లో ఐఐటి ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి, బిట్స్ పిలానీకి చోటు దక్కింది.
అయితే గత ఏడాది రేటింగ్ కంటే దాదాపు అన్ని విద్యాసంస్థలు కిందకు దిగజారాయి. ప్రపంచంలో తొలి పది స్థానాల్లో ఎంఐటి, స్టాన్‌ఫోర్డు, హార్వర్డు, కాల్‌టెక్, కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డు, యుఎల్‌సి, ఇంపీరియల్ కాలేజీ, చికాగో యూనివర్శిటీ, ఇటిహెచ్ జ్యురిచ్ ఉన్నాయి. సబ్జెక్టులు వారీ యూనివర్శిటీల ర్యాంకులను ఈసారి కేటాయించారు. అన్ని సబ్జెక్టుల్లో ఒకే స్థాయిలో ఉన్నవాటికి ఒకే ర్యాంకు ఇవ్వగా, ఒక్కో సబ్జెక్టులో ఒక్కో ర్యాంకు వచ్చిన వర్శిటీలకు ర్యాంకింగ్ రేంజ్‌ను కేటాయించింది. జాబితాలో ఐఐటి ఢిల్లీ 172 వ స్థానం దక్కించుకోగా, ఐఐటి ముంబై 179, ఐఐఎస్ -190, ఐఐటి మద్రాస్ 264, ఐఐటి కాన్పూర్ 293, ఐఐటి ఖరగ్‌పూర్ 308, ఐఐటి రూర్కీ 431-440, ఐఐటి గౌహతి 501-550, జాదవ్‌పూర్ యూనివర్శిటీ 601-650, అన్నా యూనివర్శిటీ 651-700, మణిపాల్ యూనివర్శిటీ 701-750, యూనివర్శిటీ ఆఫ్ కలకటా 751-800, అలిఘర్ ముస్లిం యూనివర్శిటీ 801-1000, బిఐటియు 801-1000, బిట్స్ పిలానీ 801, యూనివర్శిటీ ఆఫ్ ముంబై 801-1000, సావిత్రీ భాయ్ పూలే పూనే యూనివర్శిటీ 801-1000 ర్యాంకులను సాధించాయి. మొత్తంగా చూస్తే పలు యూనివర్శిటీలు 25 సబ్జెక్టుల్లో తమ స్థాయిని దిగజార్చుకున్నాయి. కొన్ని ప్రసిద్ధి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రం 48 సబ్జెక్టుల్లో 80 ర్యాంకులను పెంచుకోగలిగాయి. ఐదు అంశాల్లో ప్రతిభను చాటుకున్న ఐఐఎస్ బెంగలూరు 33 అంశాల్లో తమ స్థాయి దిగజార్చుకుంది. గత ఏడాదితో పోలిస్తే 11 సబ్జెక్టుల్లో తమ ర్యాంకును కోల్పోయింది.
సివిల్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఏరోనాటికల్, మాన్యుఫ్యాక్చరింగ్ , కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో మెరుగ్గా ఉంది. ఐఐటి ముంబై 21 సబ్జెక్టుల్లో తన ర్యాంకును నిలుపుకుంది. ఐఐటి ఢిల్లీ కెమికల్ ఇంజనీరింగ్‌లో, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, బయాలజీ సైనె్సస్, లింగ్విస్టిక్స్‌లో తన స్థానాన్ని దక్కించుకుంది. ఐఐటి కాన్పూర్ 13 సబ్జెక్టుల్లో అగ్రస్థానంలో నిలవగా మెకానికల్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో మాత్రం దిగజారింది. ఐఐటి మద్రాస్ ఐదు సబ్జెక్టుల్లో , ఐఐటి రూర్కీ మూడు సబ్జెక్టుల్లో , ఐఐటి గౌహతి మూడింట దిగజారాయి. దేశంలోని 20 ఐఐఎంలలో మూడు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. ఐఐఎం అహ్మదాబాద్, కలకటా, బెంగలూరు చోటు సంపాదించాయి. జెఎన్‌యు ఢిల్లీ రెండు సబ్జెక్టుల్లో దిగజారింది. మొత్తంగా చూస్తే జాబితాలో 25 భారతీయ విద్యా సంస్థలు చోటు దక్కించుకున్నాయి.