బిజినెస్

నీరవ్ మోదీ గ్రూప్ ఖాతాల స్తంభన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 1: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ని మోసగించిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ గ్రూప్ కంపెనీలకు చెందిన మూడు ఖాతాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) స్తంభింపచేసింది. ఈ ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా దర్యాప్తు సంస్థలకు అందజేసినట్లు ఎస్‌బీఐ అధికారులు తెలిపారు. తాము జరిపిన అంతర్గత తనిఖీలలో నీరవ్ మోదీ గ్రూప్ కంపెనీలకు చెందిన మూడు ఖాతాలు విదేశాల్లోని తమ బ్రాంచ్‌లలో ఉన్నట్లు తేలిందని వారు వివరించారు. దుబాయి, బహ్రెయిన్, యాంట్‌వెర్ప్‌లలోని ఎస్‌బీఐ శాఖలలో ఈ మూడు ఖాతాలు ఉన్నాయి. అయితే, ఈ మూడు ఖాతాలకు పీఎన్‌బీని మోసగించిన సంఘటనతో ప్రత్యక్ష సంబంధం లేదని వారు వెల్లడించారు. అయితే, దర్యాప్తుకు దోహదపడుతుందనే ఉద్దేశంతో ఈ మూడు ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ, ఇతర సంబంధిత సంస్థలకు అందజేసినట్లు అధికారులు ఎస్‌బీఐ అధికారులు వివరించారు.