బిజినెస్

వృద్ధి సాధించిన సింగరేణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 1: సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి , రవాణాలో ఈ ఏడాది తొలి 11 నెలల్లో 7.2 శాతం వృద్ధిరేటును సాధించినట్లు సింగరేణి సిఎండి ఎన్ శ్రీ్ధర్ తెలిపారు. గత ఏడాది ఇదే కాలానికి 543 లక్షల టన్నులబొగ్గును రవాణా చేయగా, ఈ ఏడాది 582 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు ఆయన చెప్పారు. మొదటి 11 నెలల కాలంలో 286 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్‌ను తొలగించినట్లు చెప్పారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 5 లక్షల టన్నుల బొగ్గును అధికంగా ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. 11 నెలల కాలంలో రికార్డు స్థాయిలో బొగ్గు రవాణా చేయడంలో కార్మికులు, సిబ్బంది చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.