బిజినెస్

మూడో రోజూ నష్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 1: స్థూల ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, ద్రవ్యలోటు పెరుగుతుందనే ఆందోళనతో పాటు అమెరికాలో వడ్డీ రేటు పెరుగుతుందనే భయం కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లలో చోటు చేసుకున్న అమ్మకాల ఒత్తిడి గురువారం దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో వరుసగా మూడో రోజు దేశీయ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ గురువారం 137 పాయింట్లు (0.40 శాతం) పడిపోయి, 34,046.94 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 34.50 పాయింట్లు (0.33 శాతం) దిగజారింది. బ్యాంకింగ్ షేర్లు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు బాగా నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. బ్యాంకులను మోసగించి, భారీ మొత్తంలో నష్టం కలిగించిన కేసుల భవితవ్యం ఎలా ఉంటుందోనన్న భయంతో మదుపరులు అమ్మకాలకు పూనుకున్నారు. అయితే ఫిబ్రవరి నెలలో వాహనాల అమ్మకాలు ఆశాజనకంగా ఉండటంతో వాహన కంపెనీల షేర్లకు గురువారం డిమాండ్ పెరిగింది. మూడో త్రైమాసికంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు సానుకూలంగా ఉండటంతో గురువారం ఉదయం అధిక స్థాయి వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ తొలి దశ లావాదేవీల్లో 34,278.63 పాయింట్లకు పెరిగింది. అయితే ప్రపంచ మార్కెట్లలో ఎడతెరిపి లేకుండా అమ్మకాలు సాగడంతో దేశీయ స్టాక్ మార్కెట్ ప్రతికూల ధోరణిలోకి వెళ్లిపోయి, సెనె్సక్స్ 34,015.79 పాయింట్ల కనిష్ట స్థాయికి దిగజారింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 137.10 పాయింట్లు (0.40 శాతం) నష్టంతో 34,046.94 పాయింట్ల వద్ద ముగిసింది. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ నేతృత్వంలో సెనె్సక్స్ ప్యాక్‌లోని 20 సంస్థల షేర్ల విలువ పడిపోవడంతో ఈ సూచీ పతనమయింది. నిఫ్టీ కూడా గురువారం 34.50 పాయింట్లు (0.33 శాతం) పడిపోయి, 10,458.35 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఈ సూచీ 10,525.50- 10,447.15 పాయింట్ల మధ్య కదలాడింది. ఆసియన్ మార్కెట్లు కూడా గురువారం స్థూలంగా నష్టాల్లోనే ముగిశాయి.
సెనె్సక్స్ ప్యాక్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్ అత్యధికంగా 2.63 శాతం నష్టపోగా, 2.31 శాతం నష్టంతో ఎస్‌బీఐ తరువాత స్థానంలో నిలిచింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్, రిల్, హీరో మోటోకార్ప్, యెస్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, డాక్టర్ రెడ్డీస్, అదాని పోర్ట్స్, సన్ ఫార్మా, ఎన్‌టీపీసీ, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ ఉన్నాయి. వీటి షేర్ల ధర 1.19 శాతం వరకు పడిపోయింది. ఇందుకు భిన్నంగా, కోల్ ఇండియా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, ఎంఅండ్‌ఎం, కోటక్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, మారుతి సుజుకి లాభపడ్డాయి.