బిజినెస్

పసుపు కోసం ప్రత్యేక సెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: స్పైసిస్ బోర్డు కార్యాలయంలోనే తెలంగాణ పసుపునకు సంబంధించి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. తెలంగాణలో పసుపు బోర్డు స్థాపించాలని కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ స్పైసెస్ బోర్డు కార్యాలయంలోనే పసుపు కోసం తెలంగాణ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు. అలాగే తెలంగాణలో పసుపు కోసం ఒక స్పైసెస్ పార్క్ ఏర్పాటుకు సహాకారం అందిస్తామని కేంద్రమంత్రి ఆ లేఖలో స్పష్టం చేశారు. పసుపు మార్కెటింగ్, రీసెర్చీ ద్వారా పంట అభివృద్ధి చేయాల్సిన భాద్యత కేంద్ర, రాష్ట్రాల వ్యవసాయ శాఖలపై ఉందని కేంద్రమంత్రి సూచించారు. అలాగే స్పైసిస్ బోర్డు ద్వారా పసుపుతో పాటు ఇతర వాణిజ్య సంబంధ పంట ఉత్పత్తుల ఎగుమతులు, నాణ్యత ప్రమాణాలు పర్యవేక్షణ వంటి కార్యక్రమాలను ప్రత్యేక సెల్ పర్యవేక్షిస్తుందని లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ట్రేడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్‌పోర్ట్ స్కీం కింద పసుపు కోసం ప్రత్యేకంగా స్పైసిస్ పార్క్ కూడా నెలకొల్పుతామని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు తెలంగాణకు రాసిన లేఖలో హామీ ఇచ్చారు.