బిజినెస్

అరచేతిలో మీ-సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, మార్చి 2: ప్రభుత్వ సేవలు ఇక మరింత చేరువకానున్నాయి. 150 రకాల ప్రభుత్వ, ఇతర సేవలతో తెలంగాణ ప్రభుత్వం టీ-యాప్ పోలియో అప్లికేషన్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించడంతో మీ సేవ సర్వీసులన్నీ ఓపెన్ అన్‌లైన్‌లోకి వచ్చాయి. యాప్ ద్వారా ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాలు, మీ-సేవ కేంద్రాలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే ఇంటి నుంచే అరచేతి ద్వారా ప్రభుత్వ సేవలు పొందవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ సేవలను సత్వరమే ప్రజలకు అందించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే టీ-ఫైబర్ ద్వారా ఇంటింటికీ అంతర్జాలం సేవలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రజలు మీ సేవ కేంద్రాలకు వెళ్లి ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునే పని లేకుండా మొబైల్ ద్వారా చేసుకునే సౌకర్యాన్ని టీ-యాప్ పోలియో కల్పిస్తోంది. మంత్రి కేటీఆర్ అధికారికంగా ఈ యాప్‌ను ప్రారంభించడంతో అధికారులు అమలుకు కావాల్సిన ఏర్పాట్లపై దృష్టి సారించారు.
యాప్‌లో ప్రత్యేకతలు
విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరమున్నా, వివాహితులకు స్థానిక గుర్తింపుపత్రం పొందాలన్నా, రైతులకు పహాణి, ఆరోవోఆర్ వన్‌బీ నకలు పొందాలన్నా, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ముందు దైవదర్శనంతో పాటు కావాల్సిన గదుల సదుపాయం బుకింగ్ కొరకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి. యాప్ ద్వారా తక్కువ ఖర్చుతోనే ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కులం, ఆదాయం వంటి ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తు చేసుకోవాలంటే మీసేవ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ సేవలు కేవలం మీ సేవలోనే అందుబాటులో ఉంటున్నాయి. టీ-యాప్ పోలియో విధానంలో మీ సేవ సర్వీసులన్నీ ఓపెన్ అన్‌లైన్‌ల్లోకి వచ్చేస్తాయి. అంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మీసేవ కేంద్రానికి వెళ్లకుండానే ఎక్కడి నుంచైనా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. తొలుత 150 సేవలను యాప్ ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానంలో మొబైల్ ఫోన్ సంఖ్య, ఆధార్ అనుసంధానంతో ముందుగా యాప్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనుసంధానం అయిన వారు మాత్రమే సంబంధిత ధ్రువీకరణ పత్రాలను యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. స్మార్ట్ఫోన్, కంప్యూటర్ ద్వారా దరఖాస్తు చేసుకొవచ్చు. అన్‌లైన్ కేంద్రాలకు వెళ్లి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకున్న విధానంలో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నప్పటికి పత్రాలను తీసుకొని తహశీల్దారు కార్యాలయం చుట్టూ తిరిగితే కానీ ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యేవి కావు. ఈ విధానంలో దరఖాస్తు చేసుకుంటే ఏ మేరకు రెవెన్యూ అధికారులు పత్రాలను జారీ చేస్తారో వేచి చూడాల్సి ఉంది. రెవెన్యూ అధికారులు దరఖాస్తులను ఆమోదించిన తరువాత టీ-యాప్ విధానంలోనూ తిరిగి మీ సేవా కేంద్రానికి వచ్చి ధ్రువీకరణ పత్రాలను పొందాల్సి ఉంటుంది. భవిష్యత్తులో పోస్టల్ ద్వారా పత్రాలను నేరుగా ఇంటికే పంపించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానం వల్ల మీసేవలో చెల్లించే దరఖాస్తు రుసుము తప్పుతుందని తెలుస్తోంది.
రిజిస్ట్రేషన్ ఎలా?
గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి టీయాప్ పోలియో అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. న్యూయూజర్‌పై క్లిక్ చేయాలి. మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెంటనే మొబైల్‌తో పాటు ఈ-మెయిల్‌కు ఆరు అంకెలతో కూడిన పాస్‌వర్డ్‌తో సంక్లిప్త సమాచారం వస్తుంది.

చిత్రం..టీ-యాప్ పోలియోయాప్