బిజినెస్

సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఫిబ్రవరి నెలలో 93.59 ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పిఎల్‌ఎఫ్)ను సాధించింది. ఈ ఏడాది ఇంతవరకు 90.70 శాతం పిఎల్‌ఎఫ్‌ను సాధించినట్లు సింగరేణి సిఎండి ఎన్ శ్రీ్ధర్ చెప్పారు. దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నామన్నారు. డిసెంబర్ నెల వరకు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 90.19 పిఎల్‌ఎఫ్‌ను సాధించి దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి నెలలో ఒకటో ప్లాంట్ 378 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసి 378 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్ సరఫరా చేసింది. తద్వారా 93.73 పిఎల్‌ఎఫ్‌ను సాధించారు. రెండో ప్లాంట్ 377 ఎంయు విద్యుత్ ఉత్పత్తి చేసి 355 ఎంయు విద్యుత్‌ను సరఫరా చేయడం ద్వారా 93.44 పిఎల్‌ఎఫ్‌ను సాధించింది. పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలకు తగిన విధంగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ రాష్ట్రానికి విద్యుత్‌ను అందించాలని, దీనికి అందరూ కృషి చేయాలని సిఎండి శ్రీ్ధర్ కోరారు. మెరుగైన ఉత్పత్తి, సరఫరా ద్వారా జాతీయ స్థాయిలో మరింత మెరుగైన స్థానం సాధించాలన్నారు.